Samantha Divorce Reason: చైతూ టార్చర్ తట్టుకోలేకే విడాకులు.. ఎట్టకేలకు నోరు విప్పిన సమంత?
Samantha Ruthprabhu Met Nagachaitanya Mother: అమెరికాలో నివాసం ఉంటున్న నాగచైతన్య తల్లిని కలిసి సమంత తన బాధ అంతా వెళ్లగక్కినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Samantha Ruthprabhu Met Nagachaitanya Mother and Revealed the reason for Divorce: అక్కినేని నాగచైతన్య -సమంత విడాకులు వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. ఏం మాయ చేసావే సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ మొదటి సారి పరిచయమయ్యారు అయితే అప్పటికప్పుడు ప్రేమ పుట్టలేదు. కానీ తర్వాత కొన్నేళ్లపాటి స్నేహం ప్రేమగా మారింది. ఆ ప్రేమని వీరిద్దరూ ఇంట్లో ఒప్పించి పెద్దల అనుమతితోనే పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి కాపురం మాత్రం సజావుగా సాగలేదు వీరు విడిపోతారంటూ అనూహ్యంగా వార్తలు రావడం, వాటికి బలం చేకూరుస్తూనే వీరిద్దరూ తమ విడిపోతున్నామని అధికారికంగా ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే అసలు వీరు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అనే విషయం మీద ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు.
వారిని అడిగితే మా ఇద్దరికీ సరిపడలేదు, కాబట్టి విడిపోయామనే మాట చెబుతూ ఉంటారు. అయితే సమంత తప్పు చేసిందని, పిల్లల్ని కనమంటే కనలేదని ఒక ప్రచారం, లేదు వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకుందని, అక్కినేని కుటుంబం చెప్పినట్టు కాకుండా అందాలు ఆరబోతకు ప్రాధాన్యం ఇస్తూ ఫ్యామిలీ మెన్ లాంటి వెబ్ సిరీస్లు చేసిందని, అందువల్లే ఆమెతో విడాకులు తీసుకునేందుకు చైతన్య సిద్ధమయ్యాడని ఇలా రకరకాల ప్రచారాలు అయితే జరిగాయి. ఈ ప్రచారాలు చూడలేక, వినలేక సమంత ఏకంగా కోర్టుకు వెళ్లి ఈ ప్రచారాలు చేస్తున్న వారి మీద చర్యలు తీసుకోవాలని కోరింది. దానికి కోర్టు కూడా చర్యలు తీసుకుంటామని చెబుతూనే పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు బయట పెట్టకూడదని ఆదేశించింది.
ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు సమంత అక్కినేని నాగచైతన్య తల్లిని కలిసినట్లు తెలుస్తోంది. అక్కినేని నాగార్జున -లక్ష్మీ దంపతులకు నాగచైతన్య జన్మించిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత మనస్పర్ధలు రావడంతో నాగార్జున నుంచి లక్ష్మీ విడిపోయి అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఇటీవల శస్త్ర చికిత్స కోసం అమెరికా వెళ్లిన సమంత తన మాజీ భర్త తల్లిని కలిసి తన బాధ ఆమె దగ్గర వెళ్లగక్కింది అనే ప్రచారం జరుగుతోంది. లక్ష్మీ దగ్గరకు వెళ్లిన సమంత నాగచైతన్య తనను టార్చర్ చేసినట్లు ఆమె ముందు తన బాధ బయటపెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఆ టార్చర్ భరించలేక తాను విడాకులు తీసుకున్నట్లు ఆమె చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.
పెళ్ళికి ముందు ఉన్న చైతు పెళ్లి తర్వాత లేడని, ఆయన పూర్తిగా మారిపోయాడని తనను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినట్లుగా సమంత వాపోయినట్లు ప్రచారం జరుగుతుంది. పెళ్లికి ముందు అన్ని విషయాల్లో తనను సపోర్ట్ చేసిన నాగచైతన్య పెళ్లి తర్వాత మాత్రం ఆ సినిమా చేయొద్దు, అలాంటి డ్రెస్ వేసుకోవద్దు, వాళ్లతో మాట్లాడవద్దు అంటూ ఆంక్షలు పెట్టేందుకు ప్రయత్నించాడని దాని వలన తను స్వేచ్ఛ మొత్తం కోల్పోయినట్లుగా భావించి కొన్నాళ్లపాటు ఇబ్బంది పడ్డానని అందుకే చైతూతో గొడవ పడినట్లుగా సమంత లక్ష్మీకి చెప్పినట్టు ప్రచారం మొదలైంది.
ఈ విషయాలన్నీ తెలిసినా కూడా అక్కినేని ఫ్యామిలీ కూడా అతనికే సపోర్ట్ చేయడంతో తన ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఎక్కువ రోజులు బాధలు పడలేక విడాకులు తీసుకున్నానని ఆమెకు చెప్పి బాధపడిందట. అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ ఈ వ్యవహారం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.
Also Read: Godfather Weekend Collections: గాడ్ ఫాదర్ వసూళ్లలో జోరు.. ఫస్ట్ వీకెండ్ ఎంత రాబట్టింది అంటే?
Also Read: MS Dhoni into film industry: సినీ ఇండస్ట్రీలోకి ధోని ఎంట్రీ.. ఆ సినిమాలతో బడా ప్లాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook