Samantha Marriage Life: మ్యారేజ్ లైఫ్‌లో 100% ఇచ్చా..ఆ సీన్ చేయమన్న వారే సాంగ్ వద్దన్నారు..సమంత సంచలనం!
Samantha 100 percent to her marriage సమంత తన వివాహం గురించి విడాకుల గురించి తాజాగా శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు
Samantha Says She gave her 100 percent to her marriage: అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకొని తర్వాత విడాకులు కూడా ఇచ్చేసిన సమంత ఈ మధ్యకాలంలో అనారోగ్యం బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలుకున్న ఆమె వాళ్లు ఆసక్తికరమైన ప్రాజెక్టులలో భాగమవుతుంది. ప్రస్తుతం సమంత హీరోయిన్గా నటించిన శాకుంతలం సినిమా ప్రమోషన్స్ పనుల్లో బిజీ బిజీగా గడుపుతోంది.
ఈ సినిమా వచ్చేనెల 14వ తేదీన విడుదలవుతున్న నేపథ్యంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ప్రమోషన్స్ జోరుగా సాగిస్తోంది. సమంత తాజాగా శాకుంతలం ప్రమోషన్స్ లో సమంత మాట్లాడుతూ పుష్ప సినిమాలో తాను చేసిన ఊ అంటావా మామ సాంగ్ తన డైవర్స్ వ్యవహారం జరుగుతున్న సమయంలో వచ్చిందని ఈ విషయం తెలిసిన తన కుటుంబ సభ్యులు అలాంటి ఆఫర్లు ఏవీ తీసుకోవద్దు, సైలెంట్ గా ఇంట్లో కూర్చొని ఉండమని చెప్పారని పేర్కొంది.
ఈ నేపథ్యంలో తాను ఈ పాట చేయాలనే నిర్ణయించుకుంటే తన స్నేహితులు శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు కూడా ఇలాంటి పాట దయచేసి చేయవద్దని కోరారని కానీ తన నిర్ణయం మేరకు సాంగ్ చేశానని ఆమె పేర్కొంది. నిజానికి సమంత ఫ్యామిలీ మెన్ సిరీస్ లో బోల్డ్ పాత్ర చేసింది అని అందరూ అనుకుంటారు.
కానీ ఆమె సూపర్ డీలక్స్ అనే సినిమాలోని ఒక వ్యక్తితో సెక్స్ చేస్తున్నట్టుగా ఉన్న సీన్లో కనిపించింది. అయితే అలాంటి సీన్ కూడా చేయమని ఎంకరేజ్ చేసిన స్నేహితులు ఇలా పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ అనగానే వద్దని చెప్పారని ఖచ్చితంగా ఇది నీ కెరీర్ మీద నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుందని చెప్పారని చెప్పుకొచ్చింది. అలాగే తాను ఎలాంటి తప్పు చేయలేదని తనకు తెలిసినప్పుడు ఆఫర్ కాదనుకొని ఇంట్లో కూర్చోవడం కరెక్ట్ కాదని భావించి తాను ఐటెం సాంగ్ చేశానని పేర్కొంది.
అలాగే విడాకుల తర్వాత తన మీద జరిగిన ట్రోలింగ్ విషయంలో కూడా కామెంట్ చేస్తూ ఈ ట్రోలింగ్ ఎప్పటికైనా తప్పు చేసే వారి వెంటే పడుతుందని, తప్పు చేయకున్నా కొన్నాళ్లు ఈ ఇబ్బంది తనకు తప్పదని ముందే భావించానని ఆమె పేర్కొంది. ఇక పెళ్లి విషయంలో తన వైపు నుంచి 100% తాను ఇచ్చాను అని కానీ అది వర్కౌట్ అవ్వలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తనను తాను బ్లెం చేసుకోవడానికి సిద్ధంగా లేనని ఆమె పేర్కొంది.
Also Read: Balagam Collections: బలగం 'బలం' ఇదీ.. ఓటీటీలో రిలీజయ్యాక కూడా థియేటర్లకు క్యూ కడుతున్న జనాలు!
Also Read: Little krishna: ఈ ఫొటో ఎవరిదో గుర్తు పట్టారా? తెలుగోడు మీసం మెలేసేలా చేసిన డైరెక్టర్ ఈయన?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook