Mahesh-Rajmouli Combo: సమంత `దూకుడు`.. మహేష్-జక్కన్న సినిమాలో హీరోయిన్గా సామ్..??
సమంత దూకుడు పెంచిందని వార్త నిజమే.. వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్న సమంత.. ప్రస్తుతం రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని ప్రచారం జరుగుతుంది. ఎంత వరకు నిజమో వేచి చూడాలి.
Samantha as a Heroine in Mahesh Babu and Rajmouli Comobo Movie?: తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచానికి తెలియజేసిన దర్శక ధీరుడు 'రాజమౌళి' (Rajamouli). జక్కన్నగా పేరు తెచ్చుకున్న రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' (RRR Movie) సినిమా షూటింగ్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ బిజీగా ఉన్నారు. క్రేజీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న రాజమౌళి.. వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన సంక్రాంతి (Sankranti) కానుకగా విడుదల కానుంది.
ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' సినిమా నుండి విడుదలైన 'రామ్ ఫర్ బీమ్' (Ram for Bheem), 'భీమ్ ఫర్ రామ్' (Bheem for Ram) మరియు ఇటీవలే విడుదలైన సింగిల్స్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచాయి.. ఈ సారి కూడా జక్కన్న తన మార్క్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతున్నారని ఇండస్ట్రీ టాక్..
Also Read: Attack on Actress Shalu Chourasia: 'ఓ పిల్లా నీ వల్ల' సినిమాలో నటించిన హీరోయిన్ పై దాడి..
అయితే రాజమౌళి ఈ సినిమా తరువాత మహేష్ బాబుతో (Mahesh Babu) సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజమౌళి ఈ సినిమాను అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్నారని.. ఆఫ్రికన్ జంగిల్ (African Jungle) బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా ఉండబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా.. మహేష్ బాబు - రాజమౌళి కాంబో (Mahesh Babu- Rajmouli Combo) పై ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే.. మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో హీరోయిన్ గా సమంత (Samanth) ను ఎంపిక చేసినట్లు టాక్.. సమంత అటు రాజమౌళి, మహేష్ బాబు ఇద్దరికీ సక్సెస్ హీరోయిన్ అని తెలిసిందే! 'ఈగ' (Eega) సినిమాలో రాజమౌళితో పని చేసిన సమంత... ఈ సినిమా ఎంత హిట్ అయిందో మన అందరికీ తెలిసిందే.. ఈ సినిమాకు సమంతకు అవార్డ్స్ కూడా లభించాయి.
Also Read: AUS Winning Celebration: 'షూలో బీర్' పోసుకొని తాగిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. వీడియో వైరల్
ఇకపొతే.. సమంత, మహేష్ బాబుతో రెండు సార్లు జత కట్టింది. 'దూకుడు' (Dukudu), 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు' (Seethamma Vaakitlo Sirimalle chettu) సినిమాలు రెండు సూపర్ హిట్ సినిమాలే.. అయితే ఇద్దరికీ లక్కీగా ఉన్న సమంతను ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇదే కానీ నిజం అయితే దూకుడును ఎవరు ఆపలేరని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి