Diabetic Control:  2021 నుంచి సమంత.. మయోసైటిస్ అనే ఒక డిసార్డర్ తో.. బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా కాలం పాటు.. సినిమాలకి కూడా దూరంగా ఉన్న సమంత.. తన ట్రీట్మెంట్ మీదే దృష్టి పెట్టింది. చాలా నెలల పాటు.. చికిత్స అందుకున్న సమంత.. ఇంకా పూర్తిగా మామూలు మనిషి కాలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికీ సమంత కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తో.. బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఏదేమైనా చాలావరకు.. కోలుకున్న సమంత.. మళ్ళీ సినిమాలలో కూడా బిజీ అయింది. దీంతో సమంతను వెండితెర మీద చూడడానికి.. అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


అయితే తాజాగా.. ఒక ప్రముఖ డైటీషియన్ తో మాట్లాడుతూ.. సమంత టేక్ 20 అనే ఒక పాడ్ క్యాస్ట్ లో కనిపించింది. గత కొద్ది రోజులుగా దీనికి.. సంబంధించిన ఎపిసోడ్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులో మాట్లాడుతూ సమంత తన ఆరోగ్యం గురించి.. బోలెడు నిజాలు బయటపెట్టింది. 


తాజాగా దానికి సంబంధించిన ఒక ఎపిసోడ్ లోనే మాట్లాడుతూ.. సమంత తాను ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సమయంలో.. ఆమె 24 గంటలు గ్లూకోజ్ మానిటర్ ను తన చేతికి తగిలించుకునే ఉండేదట. ఎప్పటికప్పుడు తన షుగర్ లెవెల్స్ ని చూసుకోవడం కోసం సమంత ఆ మానిటర్ ని తీసేది కాదట. 


ఆమె చాలా హెల్తీ ఆహారం తీసుకుంటున్నప్పటికీ.. తిన్న వెంటనే ఆమె షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా పెరిగి పోయేవట. ఎప్పుడూ తినే ప్రోటీన్, కూరగాయలు కార్బోహైడ్రేట్స్.. అయినప్పటికీ ఆమె షుగర్ బాగా పెరిగిపోయేదట. కానీ మళ్ళీ అదే ఆహారాన్ని మార్చి తింటే షుగర్ అంతగా పెరిగేది కాదట. 


“షుగర్ లెవెల్స్ ఒకేసారి పెరిగిపోతూ ఉండటంతో.. నేను తినే ఆహారాన్ని.. మార్చి తిన్నాను. మొదట ఫైబర్ ఉండే.. కూరగాయలు, ఆ తరువాత ప్రోటీన్ ఆఖరిలో కార్బోహైడ్రేట్స్.. ఉండే ఆహారం తీసుకోవడం వల్ల.. నా షుగర్ లెవెల్స్ అంతకుముందు లాగా ఒకేసారి పెరగడం లేదని నేను గమనించాను" అంటూ తన డైట్ గురించి చెప్పింది సమంత. 


తన హెల్త్ కండిషన్ తో పాటు ఆహారానికి సంబంధించిన.. ఎన్నో అద్భుతమైన విషయాలను సమంత ఈ పాడ్ కాస్ట్ లో పంచుకుంటుంది. ఇక సినిమాల పరంగా కూడా సమంత బిజీగా ఉంది. ఆఖరి సరిగ్గా ఖుషి సినిమాతో.. హిట్ అందుకున్న సమంత ఇప్పుడు తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా.. మూవింగ్ పిక్చర్స్ పతాకంపై మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తోంది. 


ఒకవైపు బాలీవుడ్లో సిటాడెల్.. అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్న సమంత మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి తో కూడా ఒక సినిమా చేస్తూ త్వరలో మాలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతోంది.


Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter