Samantha Remuneration: `పుష్ప`లో ఐటెం సాంగ్ కోసం రూ.1.5 కోట్లు తీసుకుంటున్న సమంత..??
వరుస సినిమాలకు సైన్ చేస్తూ.. హీరోయిన్ సమంత ఫుల్ బిజీగా మారిపోయింది. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేయనున్న సమంత భారీ రెమ్యునరేషన్ తీసుకోనుందని హాట్ టాపిక్.. ఈ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో తెగ వైరలయ్యింది.
Samantha Shocking Remuneration for Item Song: నాగ చైతన్యతో (Nagachaitanya) విడాకులు తరువాత సమంత (Samantha) వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ కెరీర్ పై దృష్టి సారించింది. వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా అన్ని విధాల ఆచూతూచి అడుగులు వేస్తున్న సమంత ఇటీవలే "శాకుంతలం" (Shakunthalam) సినిమా షూటింగ్ చేసింది. ప్రస్తుతం సమంత ఐటెం సాంగ్ లకు కూడా ఒకే చెప్తుంది.
అల్లు అర్జున్ - సుకుమార్ (Allu Arjun - Sukumar Combo) కాంబో లో రష్మికా మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ నటిస్తున్న 'పుష్ప' (Pushpa) సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో మైత్రి మూవీ మరియు ముత్తం శెట్టి మీడియా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే!
కాజల్ (Kajal), తమన్నా (Tamanna Bhatia), పూజా హెగ్డే (Pooja Hegde) వంటి స్టార్ హీరోయిన్ లు ఐటెం సాంగ్ లో కనువిందు చేసినప్పటికీ... ఇంత మొత్తం రెమ్యునరేషన్ మాత్రం తీసుకోలేదు. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే ఐటెం సాంగ్ రెమ్యునరేషన్ లలో సమంత కొత్త రికార్డ్ సృష్టించిందనే చెప్పాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook