Samantha: సమంతకి వరుస షాక్స్.. ఇదంతా పక్కా ప్లాన్ అంటున్న అభిమానులు!
Samantha Recent Movie : ఒకప్పుడు వరుస విజయాలతో, స్టార్ హీరోల సినిమాలతో ఇండస్ట్రీని ఏలిన నటి సమంత. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ తెలుగులో అసలు ఆఫర్లు అందుకోలేకుంది. ఈ నేపథ్యంలో సామ్ ను కావాలని ఇండస్ట్రీ నుంచి దూరం చేస్తున్నారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Samantha Next Movie : ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయిన సమంత మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మాయ చేసింది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ దాదాపు 14 సంవత్సరాలుగా ఇండస్ట్రీలోనే ఉంటూ తన సత్తాచాటుతోంది సామ్.
కెరియర్ మొదట్లో కమర్షియల్ సినిమాలు చేసిన సమంత.. ఈమధ్య సోలో ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ కూడా హిట్ లు అందుకుంటూ తనదైన శైలిలో ముందుకుసాగింది. అయితే చాలా కాలం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈనతి ఇప్పుడు మాత్రం కనుమరుగుఅవుతున్నట్టు అనిపిస్తోంది.
నాగచైతన్య తో పెళ్లి అయిన తర్వాత కూడా నంబర్ వన్ హీరోయిన్ గా వరుస విజయాలు అందుకున్న సమంత.. విడాకులు తర్వాత మాత్రం అన్ని రకాలుగా ఇబ్బందులు మాత్రమే ఎదుర్కొంటుంది. ఒకవైపు వ్యక్తిగత జీవితంలో మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో చాలాకాలం పోరాటం చేసి విజయవంతంగా బయటకు వచ్చిన సమంత సినిమాల పరంగా కూడా వరుస ఫ్లాప్స్ అందుకుంది. ఎట్టకెలకి ఈ మధ్యనే ఖుషి సినిమాతో మళ్లీ చిన్న హిట్ అయితే అందుకుంది కానీ.. అది బ్లాక్ బస్టర్ సినిమా అయితే కాదు. మరోవైపు టాలీవుడ్ నుంచి దర్శక నిర్మాతలు కూడా సమంతకి భారీ ప్రాజెక్టులు ఇవ్వడం లేదు. శ్రీలీల, కీర్తి సురేష్, రష్మిక మందన్న వంటి హీరోయిన్లకి పెద్దపీట వేస్తూ సమంతకి టాలీవుడ్ పెద్ద షాక్ ఇస్తోంది.
అటు బాలీవుడ్ లో కూడా ఆమెకు అదే పరిస్థితి ఏర్పడింది. ఫ్యామిలీ మ్యాన్ తో సామ్ బాలీవుడ్ లో మంచి మార్కులు వేయించుకున్నప్పటికీ.. ఆ తర్వాత యానిమల్ సినిమాతో వచ్చిన రష్మిక ఆఫర్లు అందుకోవడంలో సామ్ ను ఓవర్ టేక్ చేసేసింది. మరోవైపు ఫాన్స్ మాత్రం కావాలని టాలీవుడ్ ఇండస్ట్రీ ఆమెను దూరం పెడుతోంది అని, ఆమెకు సరైన ఆఫర్లు ఇవ్వడం లేదు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సమంత తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ తో తానే హీరోయిన్ గా మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తోంది. ఆ సినిమా హిట్ అయితే అయినా సామ్ కి మరిన్ని ఆఫర్లు వస్తాయేమో చూడాలి.
Also read: High Security To Chandrababu:బాబు భద్రత పెంపు ఫలితాలకు ముందే బిగ్ ట్విస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook