Samantha Shakunthalam Movie: చైతూతో విడాకుల అనంతరం చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా మారిపోయింది సమంత (Samantha). తీరిక లేకుండా షూటింగ్స్ లో గడుపుతోంది. తెలుగులో సమంత కీలకపాత్రలో నటిస్తున్న సినిమా 'శాకుంతలం' (Shakunthalam Movie). ఇది పౌరాణిక చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్​ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్ డేట్ ను సమంత షేర్ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శాకుంతలం సినిమా డబ్బింగ్ పూర్తి చేశానంటూ సామ్..తన ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) పేర్కొంది. దీంతో సామ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సమంత ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఈ చిత్రంతో వెండి తెర ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమాను గుణ టీమ్‌వర్క్స్, దిల్ ​రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ అనౌన్స్‌ చేసే అవకాశం ఉంది.


ప్రస్తుతం తమిళంలో ఆమె నటించిన 'కాతు వాకుల రెండు కాదల్' విడుదలకు సిద్ధంగా ఉంది. సామ్ నటిస్తున్న యశోద, సిటాడెల్, అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ వంటి చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. సమంత.. పుష్ప2లో మరో స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 


Also Read: Samantha Workout Video Viral: హెవీ వెయిట్‌లను ఈజీగా ఎత్తేస్తున్న సమంత, వీడియో వైరల్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook