Samantha's father Joseph Prabhu: సమంత, నాగ చైతన్యల విడాకుల మ్యాటర్ ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అయింది. ది ఫ్యామిలీ మేన్ -2 వెబ్ సిరీస్‌తో హిందీ ఆడియెన్స్‌కి కూడా సుపరిచితురాలైన సమంత విడాకుల వ్యవహారం వారిని కూడా చర్చించుకునేలా చేస్తోంది. ఒకవైపు స్టార్ హీరోయిన్ స్టేటస్ కలిగి ఉండటం, మరోవైపు స్టార్ హీరో ఫ్యామిలీకి కోడలిగా వెళ్లడంతో నాగచైతన్య, సమంతల జంటకు పెళ్లి ముందు నుంచే భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ తరం హీరో, హీరోయిన్స్ కపుల్స్‌లో ఏ జంటకూ ఏర్పడనంత క్రేజ్, పబ్లిసిటీ చైతూ, సామ్ జంటకు (Samantha, Naga Chaithanya) లభించింది. అందుకే వాళ్ల డైవర్స్ కూడా ఇప్పుడు అంతే వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమంత, నాగచైతన్యల విడాకులపై అక్కినేని కుటుంబం తరపున నాగార్జున (Nagarjuna about Naga Chaitanya, Samantha divorce) స్పందించడం అందరికీ తెలిసిందే. కానీ అసలు ఈ విషయంపై సమంత తల్లిదండ్రుల స్పందన ఏంటనేదే చాలా మందికి కలుగుతున్న సందేహం. తాజాగా ఆ సమాచారం కూడా వచ్చేసింది. చైతూ, సమంతలు విడాకులు తీసుకోవడంపై సమంత తండ్రి జోసెఫ్ ప్రభు (Samantha's father Joseph Prabhu) స్పందించారు. 


Also read : Naga Chaitanya: 'చాలా హ్యాపీగా ఉంది..'విడాకుల అనంతరం తొలిసారి ట్వీట్‌ చేసిన చై


తన కూతురు విడాకులు గురించి తెలిశాకా తనకేమీ తోచలేదని, మైండ్ బ్లాంక్ అయ్యిందని జోసేఫ్ ప్రభు తెలిపారు. సమంత (Samantha latest updates) స్పృహలో ఉండే ఈ నిర్ణయం తీసుకుందన్న జోసెఫ్.. త్వరలోనే పరిస్థితులు అన్నీ సద్దుమణుగుతాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. సమంత తండ్రికి నెటిజెన్స్ నుంచి మద్ధతు లభిస్తోంది. త్వరలోనే పరిస్థితులు సర్దుకుంటాయని, అప్పటివరకు ధైర్యంగా ఉండాల్సిందిగా సూచిస్తూ సమంత ఫ్యాన్స్ (Samantha fans) ట్వీట్ చేస్తున్నారు.


Also read : Hero Ram Pothineni Injured: గాయపడ్డ హీరో 'రామ్ పోతీనేని'...'రాపో19' షూటింగ్ కు బ్రేక్!


Also read : Prakash Raj: 'పెద్దల ఆశీర్వాదం నొకొద్దు.. సత్తా ఉన్నవాడే అధ్యక్షుడిగా గెలవాలి'..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook