Sampoornesh Babu Cauliflower Movie Updates: 'హృదయ కాలేయం' సినిమాతో సంపూర్ణేష్‌ బాబు హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు. సరికొత్త కథ, టైటిల్స్‌లతో వరుసగా సినిమాలు చేస్తూ.. అనతికాలంలోనే ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుని 'బర్నింగ్‌ స్టార్'గా ఎదిగారు. ప్రేక్షకులను నవ్వించడంలో సంపూర్ణేష్‌ బాబుది సెపరేట్ స్టైల్ అనడంలో అలాంటి అతిశయోక్తి లేదు. సంపూ ప్రస్తుతం 'క్యాలీ ఫ్లవర్‌' అనే స‌రికొత్త టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'శీలో రక్షతి రక్షిత:' అనేది కాప్షన్. గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్యాలీఫ్లవర్ ఎందుకని డైరెక్టరను అడిగితే..
సంపూర్ణేష్‌ బాబు ద్విపాత్రాభినయంతో తెరకెక్కిన 'క్యాలీఫ్లవర్‌' సినిమా ఈ శుక్రవారం (November 26) ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సంపూ  బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నారు. 'ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాను. పెద్దాయన ఆండ్రిఫ్లవర్.. రెండో పాత్రకు క్యాలీఫ్లవర్ అనిపెట్టారు. క్యాలీ ఫ్లవర్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు అని నేను డైరెక్టరను అడిగితే.. 'క్యారెక్టర్ పేరు కూడా అదే, ఒకానొక సమయంలో కాపాడే కవచంగా కూడా మారుతుంది' అని అన్నారు. సినిమా చేస్తున్నపుడు ఈ టైటిల్ ఇందుకే పెట్టారా అని అనిపించింది' అని సంపూర్ణేష్‌ తెలిపారు. 


Also Read: IND vs NZ 1st Test: టీమిండియాదే బ్యాటింగ్.. అయ్యర్ అరంగేట్రం! తెలుగు ఆటగాడికి దక్కని చోటు!!


అమీర్ ఖాన్ తర్వాత నేనే చేశా...
'శీలం అనేది కేవలం ఆడవాళ్లకే కాదు, మగవాళ్లకీ ముఖ్యమే. అది కనుక పాటిస్తే ప్రపంచంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావనే అంశంతో దర్శకుడుఈ కథని తెరకెక్కించాడు. ఆండీప్లవర్‌, క్యాలీఫ్లవర్‌ అనే రెండు పాత్రలు చేశాను. ఆ పాత్రల గురించి చెప్పినప్పుడు నాకేం అనిపించలేదు. అయితే వాటి లుక్స్‌ బయటికొచ్చాక మాత్రం నేనే ఆశ్చర్యపోయా. కొద్దిమంది బంధువులు, స్నేహితులు క్యాలీఫ్లవర్‌ అడ్డు పెట్టుకుని కనిపించే లుక్‌ చూసి 'మరీ ఇలా చేశావేంది?' అని సరదాగా ఆడుకున్నారు. వాళ్లు ఇంత సీరియస్‌గా తీసుకున్నారా? అని అప్పుడు అనిపించింది. 'పీకే'లో అమీర్ ఖాన్ సర్ రేడియో అడ్డుపెట్టుకుని కనిపిస్తారు. ఆ తర్వాత మళ్లీ అలాంటి సీన్ క్యాలీఫ్లవర్‌ అడ్డు పెట్టుకుని నేనే చేశా. దర్శకుడు ఎప్పట్నుంచో నన్ను దృష్టిలో పెట్టుకునే ఈ కథ రాసుకున్నారట. ఆయన ఈ కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశా' అని సంపూర్ణేష్‌ బాబు చెప్పారు. 


తమిళంలో హీరోగా ఓ సినిమా చేస్తున్నా...
'నా పాత్రలు చేసే విన్యాసాలు ఓ పరాకాష్టలా అనిపిస్తాయి. ఆ ప్రయత్నమే ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తోంది. తదుపరి సినిమాలో ఐదు పాత్రల్లో కనిపిస్తాను. అప్పుడు మరింత వినోదం ఉంటుంది. ఈరోజు సంతోషంగా ఉన్నాం కదా.. రేపు ఇలాగే ఉంటామన్న ఓ నమ్మకమైతే నాలో ఉంది. హీరోగా నాలుగు సినిమాలు చేస్తున్నా. నరసింహాచారి నుంచి సంపూగా ఎదగడం, ఆటోలో తిరగడం నుంచి ఫ్లైట్‌లో తిరిగే స్థాయికి రావడం నా అదృష్టం. ఇక ఉన్నంతలో కొంత దానం చేయడంలో ఎదో తెలియని సంతృప్తి ఉంది. అందుకే అప్పుడప్పుడు  సాయం చేయడంలో ముందుంటాను. ప్రస్తుతం తమిళంలో హీరోగా ఓ సినిమా చేస్తున్నా. సాయి రాజేష్‌ అన్న, నేను కలిసి మళ్లీ 2022లో ఓ సినిమా చేస్తాం' అని సంపూ చెప్పుకొచ్చారు. 


Also Read: ప్రముఖ కొరియోగ్రాఫర్‌కు కరోనా, చికిత్సకు డబ్బుల్లేక...


నేను ఎంత అతి చేసినా...
'కొబ్బరిమట్టలో చెప్పినట్టుగా భారీ లెంగ్తీ డైలాగ్స్ క్యాలీ ఫ్లవర్‌ సినిమాలో ఉండవు. అయితే కోర్ట్ సీన్‌లో మాత్రం కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఈ సినిమాలో గెటప్స్ బాగా సెట్ అయ్యాయి. హీరో రేప్‌కు గురవ్వడం, ఆ తరువాత వచ్చే పాటలు బాగుంటాయి. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాల్లా ఈ చిత్రం కూడా అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో ఫ్లోర్ మూమెంట్స్ వంటివి ఏం చేయలేదు కానీ కొత్తగా ట్రై చేశాను. నేను ఎంత అతి చేసినా.. ప్రేక్షకులు ఆదరిస్తారు. అందుకే చేస్తున్నా. దీన్ని దృష్టిలో పెట్టుకునే కథలు రాస్తుంటారు' అని బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌ బాబు అన్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook