Samyuktha Menon: పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన బీమ్లా నాయక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సంయుక్త మీనన్. అప్పటికే మలయాళంలో పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు.. పవన్ కళ్యాణ్ సినిమాలో రానాకి జోడిగా నటించింది. ఆ తరువాత తమిళ ఇండస్ట్రీలో సైతం అడుగుపెట్టి ధనుష్ సార్ సినిమాతో మంచి విజయం సాధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ హీరోయిన్ సాయి ధరం తేజ్ తో చేసిన విరూపాక్ష చిత్రం ఈమెకు తెలుగులో సైతం మంచి పేరు తెచ్చిపెట్టింది. త్వరలోనే నిఖిల్ హీరోగా చేస్తున్న స్వయంభూ సినిమాలో కనిపించనుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ మలయాళీ ఇండస్ట్రీకి.. తెలుగు ఇండస్ట్రీకి మధ్య ఉన్న తేడా గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


సంయుక్త మీనన్ మాట్లాడుతూ..’తెలుగు సినిమాల్లో నటించడం చాలా కష్టం. దీనికి భాష రాకపోవడం ఒక కారణమైతే.. మేకప్‌ మరో ముఖ్యమైన కారణం. ఇది వినడానికి మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది చాలా పెద్ద విషయమే. మలయాళ సినిమాల్లో చేసేటప్పుడు మేకప్‌ వేసుకోవడం చాలా సులువైన పని. అక్కడ చాలా లైట్‌గా, నేచురల్‌గా మేకప్ వేస్తారు. కాబట్టి మేకప్ చాలా త్వరగా అయిపోతుంది. దీంతో యాక్టింగ్‌ చేసేటప్పుడు కూడా మనకి ఇబ్బంది ఉండదు. అయితే తెలుగు సినిమాలలో పరిస్థితి మాత్రం అలా కాదు. ఇక్కడ మేకప్ ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మేకప్ వేసిన తర్వాత మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందే. ఎందుకంటే తెరపై అందంగా కనిపివ్వాలి. కాబట్టి ఎలా కనిపిస్తామో అనే భయం ఉంటుంది. అందుకే అప్పుడప్పుడూ చూసుకుంటూ ఉండాలి. సాధారణంగానే ఇక్కడ ఎక్కువ మేకప్‌ వేస్తారు. అందుకే షాట్‌ చేస్తున్నప్పుడు కూడా మేకప్‌ను చెక్‌ చేసుకోవాలి. అంత మేకప్ వేసుకోవడం వల్ల ముఖానికి ఏదో అతికించిన ఫీలింగ్ వస్తుంది." అంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టింది ఈ హీరోయిన్.


ప్రస్తుతం హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Also Read: KTR: ఎన్నికల్లో 12 ఎంపీలు ఇవ్వండి.. కేసీఆర్‌ను సీఎం చేద్దాం: కేటీఆర్‌ పిలుపు


Also Read: Narendra Modi: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల సిద్ధాంతం బై ద ఫ్యామిలీ, ఫర్ ద ఫ్యామిలీ.. ఆఫ్ ద ఫ్యామిలీ


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook