Sandeep Reddy Vanga son: అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ని షేక్ చేసిన.. సందీప్ రెడ్డి అదే సినిమాని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి హిట్ అందుకున్నారు. షాహిద్ కపూర్ హీరోగా నటించిన.. ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు సందీప్. ఇక ఈ మధ్యనే యానిమల్ సినిమాతో.. మరొక బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. రన్బీర్ కపూర్ హీరోగా నటించిన.. ఈ సినిమా హిందీలో మాత్రమే కాక.. తెలుగులో కూడా భారీ బ్లాక్ బస్టర్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే అసలు సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ గా..మారింది అర్జున్ రెడ్డి సినిమాతో. విజయ్ దేవరకొండ హీరోగా, శాలిని పాండే హీరోయిన్ గా.. కనిపించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. విడుదలకి ముందు.. విడుదలకి తర్వాత కూడా ఈ సినిమా ఎన్నో వివాదాలలో ఇరుక్కున్నప్పటికీ.. అవేవీ సినిమా విజయాన్ని ఆపలేకపోయాయి. 


అప్పటి నుంచే విజయ్ దేవరకొండకి కూడా సెన్సేషనల్ హీరో అనే ట్యాగ్ వచ్చింది. అప్పటిదాకా చిన్న సినిమాల్లో.. నటించిన విజయ్ దేవరకొండకి హీరోగా బ్రేక్ ఇచ్చిన సినిమా అది. ఈ సినిమా కార్య రూపం దాల్చడానికి.. సందీప్ రెడ్డి చాలానే కష్టాలు పడ్డారు. 


ఆ కథను పట్టుకొని.. విజయ్ దేవరకొండ కంటే ముందు సందీప్ ఇద్దరు ముగ్గురు హీరోలను సంప్రదించారు. కానీ అవి వర్కౌట్ అవలేదు. అదే సమయంలో సందీప్ కి కొడుకు పుట్టాడు. సినిమాకి బాగా కనెక్ట్ అయినా సందీప్ రెడ్డి.. తన కొడుకుకి కూడా అర్జున్ రెడ్డి అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని సందీప్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 


ప్రస్తుతం సందీప్ చేతుల్లో చాలానే.. ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో త్వరలో మొదలు కాబోతున్న సినిమా స్పిరిట్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా యానిమల్ సినిమాకి సీక్వెల్ గా యానిమల్ పార్క్.. అనే సినిమా కూడా చేయనున్నారు సందీప్ రెడ్డి.


Also Read: Shamshabad Airport: ఎంతైనా డబ్బులిస్తామయ్యా ఫ్లైట్‌ ఎక్కించు.. శంషాబాద్‌లో ప్రయాణికుల గొడవ


Also Read: Windows Outage: ఒక్క సమస్యతో ప్రపంచం అతలాకుతలం.. స్తంభించిన ఎయిర్‌లైన్స్‌, బ్యాంకింగ్‌, టెలికాం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter