69 Filmfare Awards: 69వ ఫిలింఫేర్ అవార్డ్స్.. హవా కొనసాగించిన సందీప్ రెడ్డివంగా యానిమల్
Animal Filmfare Awards: హిందీ చలనచిత్ర పరిశ్రమలో ఎంతో పురాతన సినిమా అవార్డులలో ఒకటైన ‘ఫిలింఫేర్ అవార్డ్స్’ జనవరి 27, 28న ఘనంగా జరుగుతున్నాయి. కాగా ఈ అవార్డుల్లో యానిమల్ సినిమా హవా కొనసాగించింది..
69 Filmfare Awards List: సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమా తెలుగు, హిందీ భాషలలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిన విషయమే. మొదట్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా దాదాపు 800 కోట్లు సంపాదించి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ లాంటి సినిమాల తరువాత సందీప్ రెడ్డి వంగాకి మరో బ్లాక్ బస్టర్ అందించింది.
కాగా యానిమల్ మూవీ బాక్సాఫీస్ దగ్గరే కాదు.. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల నామినేషన్లలోనూ దూకుడు కొనసాగించింది. ఈ మూవీ ఈ అత్యున్నతమైన హిందీ అవార్డుల ప్రోగ్రాం లో ఏకంగా 19 నామినేషన్లను సొంతం చేసుకుంది. 69వ అవార్డుల సెర్మనీ కోసం నామినీల పూర్తి జాబితాను ఈ మధ్యనే అనౌన్స్ చేశారు. ఇందులో యానిమల్ మూవీ టాప్‌లో ఉండగా.. జవాన్ సినిమా అలానే 12th ఫెయిల్ సినిమాలు కూడా కూడా కొన్ని కేటగిరీల్లో చోటు సంపాదించుకున్నాయి.
కాగా ఈ ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ సినిమా అవార్డుల వేడుక నిన్న, ఈ రోజు గుజరాత్ లో జరుగుతుంది. కాగా నిన్న టెక్నికల్ కేటగిరీల్లో ఫిలింఫేర్ అవార్డుల్ని ప్రకటించారు. ఇక ఈరోజు డైరెక్షన్, యాక్టింగ్ కేటగిరీల్లో అవార్డులు ప్రకటించనున్నారు. ఈసారి అవార్డుల్లో యానిమల్ సినిమా అలానే షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా హవా కొనసాగించాయి. అలానే విక్కీ కౌశల్ సామ్ బహదూర్ చిత్రం కూడా పెద్ద ఎత్తున అవార్డులు సొంతం చేసుకుంది.
69వ బాలీవుడ్ ఫిలింఫేర్ అవార్డుల్లో టెక్నికల్ కేటగిరీల్లో అవార్డులు గెలుచుకున్న వారి జాబితా ఇదే..
బెస్ట్ VFX – రెడ్ చిల్లీస్(జవాన్)
బెస్ట్ సౌండ్ డిజైన్ – కునాల్ శర్మ(సామ్ బహదూర్), సింక్ సినిమా(యానిమల్)
బెస్ట్ ఎడిటింగ్ – జస్కున్వర్ సింగ్, విధు వినోద్ చోప్రా(12th ఫెయిల్)
బెస్ట్ బ్యాజ్ గ్రౌండ్ స్కోర్ – హర్షవర్ధన్ రామేశ్వర్ (యానిమల్)
బెస్ట్ సినిమాటోగ్రఫీ – అవినాష్ అరుణ్ (త్రి ఆఫ్ అజ్)
బెస్ట్ కొరియోగ్రఫీ – గణేష్ ఆచార్య( వాట్ జుంఖా – రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని)
బెస్ట్ యాక్షన్ – జవాన్
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – సుబ్రతా చక్రవర్తి, అమిత్ రే(సామ్ బహదూర్)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ – సచిన్ లోవెల్కర్, దివ్య గంభీర్, నిధి గంభీర్ (సామ్ బహదూర్)
మొత్తానికి విజయ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం దేశవ్యాప్తంగా తన హవా కొనసాగిస్తున్నారు. రాజమౌళి తరువాత తెలుగు, హిందీ ప్రేక్షకులకు ఇద్దరికీ కూడా ఒకే లెవెల్ లో కనెక్ట్ అయ్యే సినిమాలు తీయగలిగే దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ దర్శకుడు ప్రభాస్ సినిమా స్పిరిట్ కథతో బిజీగా ఉన్నాడు.
Also Read: Niharika Vs Chaitanya: నిహారిక ఇంటర్యూపై మాజీ భర్త చైతన్య స్పందన.. తనను నిందించొద్దని హితవు
Also Read: ఇంట్లో ఈ దిక్కున అద్దం పెడితే అదృష్టం.. ఆ ఇంట్లోవారికి ప్రతి పనిలో విజయం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook