Sandeep Reddy Vanga Animal Park: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణబీర్ కపూర్ హీరోగా.. రష్మిక హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం యానిమల్. ఈ మూవీ ఎంతో నెగెటివిటీని, ట్రోలింగ్ ని ఎదుర్కొని కూడా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు నెలకొల్పింది.. ఇటు టాలీవుడ్ లోనే కాక అటు బాలీవుడ్ లో కూడా ఈ చిత్రం సృష్టించిన ప్రకంపనలు తక్కువైనవి కాదు.మునుపెన్నడూ చూడనటువంటి హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్నాడు సందీప్ రెడ్డి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ ఎంతో హైలైట్ అయింది. డైలాగ్స్ దగ్గర నుంచి క్యారెక్టర్జషన్ వరకు ప్రతి పాత్రకు ఎంతో వెయిటేజ్ ఇచ్చారు. ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాల తో పాటు రొమాంటిక్ సీన్స్ కూడా మంచి
ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. ఈ మూవీకి సంబంధించి సీక్వెల్ కూడా ఉంటుంది అన్న విషయం పై మొదటి నుంచే సందీప్ రెడ్డి క్లారిటీ ఇస్తూ వచ్చాడు. ఈ మూవీకి యానిమల్ పార్క్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు.


అంటే మనం చూసిన మొదటి భాగంలో క్రూరమైన జంతువులు కొన్ని మాత్రమే .. నెక్స్ట్ రాబోయే చిత్రంలో మిగతా క్రూరమైన పాత్రలు కూడా సాలిడ్ గా ఉంటాయి అన్న విషయాన్ని టైటిల్ ద్వారా చెప్పకనే చెప్పేశారు. ఈ నేపథ్యంలో మూవీలో పాత్రలకు సంబంధించి కొంతమంది హీరోల పేర్లు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. యానిమల్ ఎండింగ్ లో బాగా  రణబీర్ ను పోలిన మనిషిని బాబీ డియోల్ ఇంట్లో చూస్తాం. అంటే ఇందులో రణబీర్ రెండవ పాత్ర మరింత క్రూరంగా ఉండబోతుంది అని అర్థం. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ మూవీలో మరొక క్రూరమైన పాత్ర కోసం బాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ నటుడితో సంప్రదింపులు జరుపుతున్నారట.


ఆ యాక్టర్ మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ హస్బెండ్ విక్కీ కౌశల్.ఉరి లాంటి మిలటరీ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్కి పర్సనాలిటీ కూడా సాలిడ్ గా ఉంటుంది. అందుకే యానిమల్ పార్క్ ఓ ముఖ్యమైన పాత్ర కోసం విక్కీ కౌశల్ ను సంప్రదించి మూవీకి సంబంధించిన కథను కూడా డిస్కస్ చేశారని టాక్. అయితే ప్రస్తుతం సందీప్ రెడ్డి , ప్రభాస్ స్పిరిట్ మూవీ కోసం స్టోరీ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతున్న నేపథ్యంలో తన పూర్తి ఫోకస్ ఈ చిత్రంపై పెట్టారు. స్పిరిట్ మూవీ ఫినిష్ అయిన తర్వాత యానిమల్ సీక్వెల్స్ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది.


Also ReadMango: సమ్మర్ లో మామిడి పండ్లను అతిగా తింటున్నారా..?... ఈ విషయాలు మీకోసమే..


Also ReadSnake Bite: పాములు కుట్టబోయే ముందు ఈ సిగ్నల్స్ ఇస్తాయంట.. అలర్ట్ అయితే రిస్క్ నుంచి బైటపడ్డట్లే..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook