Animal OTT Version Update: టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. డిసెంబరు 01న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఇప్పటికీ కలెక్షన్స్ వర్షం కురిపిస్తూనే ఉంది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం సుమారు రూ.840 కోట్లను రాబట్టింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‍ఫ్లిక్స్ కొనుగోలు చేసిస సంగతి తెలిసిందే. థియేటర్ వెర్షన్ కోసం కట్ చేసిన 8-9 నిమిషాల సీన్లను నెట్‍ఫ్లిక్స్ వెర్షన్‍లో యాడ్ చేసి విడుదల చేయనున్నారు. దీంతో ఈ మూవీ 3 గంటల 30 నిమిషాల ఉండే అవకాశం ఉందని సందీప్ రెడ్డి వంగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యానిమల్ మూవీ నెట్‌‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి జనవరి మూడు లేదా నాలుగో వారంలో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉంది. యానిమల్ చిత్రంలో రణ్‍బీర్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించారు. విలన్ పాత్రలో బాబీ డియోల్, రణ్‍బీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ నటించారు. నటి తృప్తి డిమ్రి ఓ కీలకపాత్రలో మెరిసింది. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, మురాద్ ఖేతానీ, కృషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. ఏడుగురు మ్యూజిక్ డైరెక్టర్లు ఈ సినిమా కోసం పనిచేశారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. 


ఇందులో ప్రతి ఒక్కరూ తమ యాక్టింగ్ తో ఇరగదీశారు. రణ్‍బీర్, అనిల్ కపూర్ మధ్య సీన్స్ అయితే మూవీకే హైలెట్ అని చెప్పాలి. బాబీ డియోల్ తనలోని క్రూరత్వాన్ని అద్భుతంగా ప్రదర్శించాడు. రష్మిక అయితే చాలా మెచ్యూర్డ్ గా చేసింది. కనిపించేది కొన్ని సీన్లే అయినా తృప్తి డిమ్రి దేశం మెుత్తాన్ని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది. ఇంత మంది అద్బుతంగా చేశారు కాబట్టి ఈ సినిమా అంత సూపర్ హిట్ అయింది.


Also Read: Comedian Bondamani: కోలీవుడ్ లో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook