Sanjay Dutt Arjun Sarja in Thalapathy 67 దళపతి విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కిన మాస్టర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మాస్టర్ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీకి కాస్త భిన్నంగా ఉంటుంది. కథ కంటే కూడా విజయ్ ఎలివేషన్ల మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది. కథ, కథనంలో గాడి తప్పినట్టుగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మాత్రం విజయ్‌ని తన సినిమాటిక్ యూనివర్సిటీలోకి తీసుకొస్తున్నాడు లోకేష్‌.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Thalapathy 67 సినిమాకు సంబంధించిన ఏ ఒక్క అప్డేట్‌ను కూడా ఇంత వరకు వదల్లేదు. సినిమా షూటింగ్ ప్రారంభించినా కూడా సైలెంట్‌గానే చేసుకుంటూ పోయాడు. మనోబాలా తన ఆత్రుత ఆపుకోలేక ఆ విషయాన్ని బయటపెట్టి చేతులు కాల్చుకున్నాడు. వెంటనే మళ్లీ ఆ ట్వీట్ డిలీట్ చేశాడు.


అయితే ఇప్పుడు సినిమా యూనిట్ అధికారికంగా ఈ సినిమా గురించి ప్రకటించేసింది. అంతే కాకుండా ఈ సినిమాలోని నటీనటుల గురించి కూడా క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ మీనన్, మిస్కిన్, సాండీ మాస్టర్, మాథ్యూ ఇలా చాలా మంది నటిస్తున్నారట.


ఇక అంతే కాకుండా ప్రియా ఆనంద్ కూడా కనిపించబోతోందట. అయితే ఈమె హీరోయిన్ మాత్రం అయ్యే చాన్స్ ఉండదు. ఇక ఈ చిత్రంలో తాను భాగస్వామిని అవ్వాలని, కథ చెప్పినప్పుడే ఫిక్స్ అయ్యాను.. ఇది ఎంతో బాగుండబోతోందంటూ సంజయ్ దత్ చెప్పుకొచ్చాడు.


ఇక ఈ చిత్రంలో విజయ్ గ్యాంగ్ స్టర్‌గా కనిపిస్తాడా?.. వారి ఆట కట్టించే మాన్‌స్టర్‌లా కనిపిస్తాడా? అసలు ఈ సినిమాటిక్ యూనివర్సిటీ లింక్‌ను ఎలా కలుపుతాడు అన్నది చూడాలి. ఏది ఏమైనా ఇప్పుడు లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీ మీద అంచనాలు భారీగా ఉన్నాయి.


Also Read:  Taraka Ratna Health Issue: తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషయంలో తెర వెనుక హీరో.. రుణపడి ఉంటామంటున్న అభిమానులు!


Also Read: Rajinikanth Called : వీర సింహారెడ్డి డైరెక్టర్ కు రజనీకాంత్ ఫోన్.. గాల్లో తేలిపోతున్నాడుగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook