Sanjay Dutt in Prabhas Maruthi Combination Film: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతానికి వరుస సినిమాలతో మంచి జోష్ మీద ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన మారుతి డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నారని టాక్ ఉంది. ఇప్పటికీ ఈ సినిమా గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినా ఇప్పటికే ఈ సినిమా ప్రారంభోత్సవం అయితే జరిగిందని ఒక ప్రచారం ఉంది. రాజా డీలక్స్ అనే పేరుతో రూపొందతున్న ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇటీవల తెరమీదకు వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదేమిటంటే ఈ సినిమాలో ఒక బాలీవుడ్ సీనియర్ హీరో భాగమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. తాజాగా ఆ బాలీవుడ్ హీరో మరెవరో కాదు సంజయ్ దత్ అనే ప్రచారం జరుగుతోంది. మారుతీ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఒక హారర్ కామెడీ అని అంటున్నారు. తెలుగులో హారర్ కామెడీ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. గతంలో ఈ జానర్లో ఎన్నో సినిమాలు చేశారు అయినా ఆ జానర్లో సినిమా వస్తుంది అంటే కచ్చితంగా ప్రేక్షకులు దానిని ఆదరిస్తూనే ఉన్నారు.


ఈ నేపథ్యంలో ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమాలో నిజంగానే సంజయ్ దత్ నటిస్తున్నారా లేదా అనే విషయం మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. మేకర్స్ అయితే ఆయనను అప్రోచ్ అయ్యారని ఇంకా ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదని తెలుస్తోంది. సంజయ్ దత్ ఇతర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు పాత్రలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు.


కేజిఎఫ్ 2లో అయితే ఏకంగా విలన్ గా నటించి ప్రేక్షకులందరినీ ఆయన ఆకట్టుకున్నాడు. ఇక ప్రభాస్ మారుతి కాంబినేషన్ సినిమా విషయానికి వస్తే రాజా డీలక్స్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని అందులో ఒక పాత్ర కోసం మాళవిక మోహనన్ ని ఎంపిక చేశారు అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా ప్రచారమే కాగా  సినిమా యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.


నిజానికి ఈ సినిమా ప్రారంభిస్తున్నట్లు కూడా మీడియాలో ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ప్రభాస్ సన్నిహిత వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా అయితే ఇప్పటికే అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైందని ఒక మంచి ముహూర్తం చూసి ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ సినిమాలో సంజయ్ దత్ భాగమయ్యే విషయంలో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది తెలియాలి అంటే ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.


Also Read: NBK 107 Video Leaked: ఎన్బీకే 107 నుంచి వీడియో లీక్.. పప్పులో కాలేశారా.. ఇదెక్కడి లాజిక్ రా అయ్యా?


Also Read: Ponniyin Selvan Record Opening: ఆల్ టైం రికార్డులు బద్దలు కొడుతున్న పోన్నియన్ సెల్వన్?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook