Anni Manchi Sakunamule Review: అన్నీ మంచి శకునములే` రివ్యూ..ఎలా ఉందంటే?
Anni Manchi Sakunamule Story: సంతోష్ శోభన్ హీరోగా మాళవిక నాయర్ హీరోయిన్ గా దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో అన్ని మంచి శకునములే అనే సినిమా తెరకెక్కి గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
Anni Manchi Sakunamule Telugu Review: అలా మొదలైంది, ఓ బేబీ వంటి సినిమాల దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో అన్ని మంచి శకునములే అనే సినిమా రూపొందింది. సంతోష్ శోభన్ హీరోగా మాళవిక నాయర్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది స్వప్న సినిమా బ్యానర్ మీద ఈ సినిమా రూపొందడంతో పాటు టీజర్, ట్రైలర్ సినిమా నుంచి విడుదలైన పాటలు కూడా సినిమా మీద ఆసక్తి పెంచేశాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఏర్పడ్డాయి. మరి ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా ఎంతవరకు అందుకుంది అనేది సినిమా రివ్యూలో చూద్దాం.
అన్ని మంచి శకునములే కథ:
తమిళనాడు ఆంధ్ర ప్రదేశ్ బోర్డర్ లో ఉన్న ఒక కాఫీ ఎస్టేట్ కు చెందిన ఇద్దరు పార్టనర్ల మధ్య గొడవ ఏర్పడుతుంది. అది తనకు చెందుతుంది అంటే తనకు చెందుతుందంటూ ఇద్దరు కోర్టులకు ఎక్కడంతో తరాలు గడిచినా ఆ కోర్టు కేసు నలుగుతూనే ఉంటుంది. అలా ప్రసాద్(రాజేంద్రప్రసాద్), దివాకర్(రావు రమేష్), సుధాకర్ (నరేష్) మధ్య కోర్టు వ్యవహారం నడుస్తూ ఉంటుంది. అలాంటి తరుణంలో సుధాకర్ భార్య, ప్రసాద్ భార్య ఒకే హాస్పిటల్లో పక్కపక్కనే ఇద్దరు పిల్లలకు జన్మిస్తారు.
అయితే ప్రసాద్కు పుట్టిన పాపను సుధాకర్ భార్యకు పుట్టినట్లుగా భ్రమించి హాస్పిటల్ యాజమాన్యం పిల్లల్ని మార్చేస్తుంది. ఆ తరువాత వేరువేరుగా రిషి(సంతోష్ శోభన్), ఆర్య(మాళవిక నాయర్) తమ తల్లుల వద్ద కాకుండా వేరొకరి వద్ద పెరిగి పెద్దవుతారు. అయితే స్కూల్ వయసు నుంచి వీరిద్దరి మధ్య ఎట్రాక్షన్ ఏర్పడుతుంది. కానీ ఏదో రకమైన గొడవ వల్ల ఎప్పటికప్పుడు విడిపోతూ ఉంటారు. అయితే రిషికి ఆర్య మీద ప్రేమ మొదలవుతుంది. ఆ ప్రేమను ఆర్య ముందు రిషి వ్యక్తపరిచాడా? చివరికి కోర్టు కేసులు ఏమయ్యాయి ? అసలు వీరిద్దరూ పుట్టినరోజే మారిపోయారు అన్న విషయం కుటుంబ సభ్యులకి తెలుస్తుందా? లేదా? అంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
Also Read: Samantha Next Movie: సిద్దూ హీరోగా సమంత మూవీ..అంతా సెట్ చేసిన నందిని రెడ్డి?
విశ్లేషణ:
ఓ బేబీ, అలా మొదలైంది వంటి సినిమాలతో హిట్లు అందుకున్న నందిని రెడ్డి గత కొంతకాలంగా సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె అన్ని మంచి శకునములే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి మీకు ఈ సినిమా ముందు ఎప్పుడో చూశానే అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది కొత్త కథ ఏమీ కాదు కానీ నటీనటుల పర్ఫామెన్స్ తో, కామెడీతో సినిమాని నడిపించే ప్రయత్నం చేశారు.
సినిమా మొదలైన 10 నిమిషాలకి ఇది కొత్త కథ ఏమీ కాదనే విషయం చూస్తున్న ప్రేక్షకులకు అర్థం అయిపోతుంది. అనిపించినా ఫస్ట్ ఆఫ్ మాత్రం కాస్త ఆసక్తికరంగా సాగింది. నటీనటుల పెర్ఫార్మన్స్ కి తోడు కాస్త కామెడీ కూడా జోడించడంతో మొదటి హాఫ్ అంత ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ లో కూడా అనవసరమైన పాత్రల ఎంట్రీతో కాస్త గందరగోళం అయితే ఏర్పడుతుంది. నిజానికి ఈ సినిమాలో చాలా పాత్రలు ఉన్నాయి కానీ బలమైన పాత్రలు, బలమైన ముద్ర వేసే పాత్రలు మాత్రం వేళ్ళ మీద లెక్క వేసుకునేలానే ఉన్నాయి.
ఇక చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరగబోతుంది అనే విషయం ప్రేక్షకులకు ఇట్టే అర్థమయిపోతూ ఉంటుంది. సినిమా నిడివి ప్రభావమో ఏమో తెలియదు కానీ ఎమోషనల్ సీన్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. త్వర త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పాత్రల మధ్య ఎమోషన్స్ తగ్గించేసారేమో అనిపించేలా సినిమా సాగుతుంది. సినిమా మొత్తానికి ప్రధానంగా భావించే హీరో హీరోయిన్ల మంచి ప్రేమ కూడా అంత న్యాచురల్ గా అనిపించదు.
నటీనటులు:
నటీనటుల విషయానికి వస్తే సంతోష్ శోభన్ మరోసారి తనకు బాగా ఈజ్ ఉన్నట్టుగా నటించాడు. తన వయసుకు తగిన పాత్ర దొరకడంతో ఎక్కడా కూడా నటించిన భావన కలగదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన పూర్తి స్థాయిలో జీవించేశాడు. అయితే సంతోష్ శోభన్ పాత్ర డిజైన్ చేసిన విధానంలోనే కొంత ఇబ్బంది. పైకి నవ్వుతూ అల్లరి చిల్లరగా కనిపించే అతను మానసికంగా ఎంతో పరిణితి చెందిన వ్యక్తిగా అక్కడక్కడా రిజిస్టర్ చేసే ప్రయత్నం చేశారు కానీ అది ప్రేక్షకులకు రిజిస్టర్ కావడం కష్టమే. ఇక మాళవిక నాయర్ తన పాత్రకు న్యాయం చేసింది. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి వంటి వాళ్లు తమ అనుభవాన్ని స్క్రీన్ మీద చూపించారు. వెన్నెల కిషోర్, వాసుకి, తాగుబోతు రమేష్, మిర్చి హేమంత్ వంటి వారు అలాగే పాత్రధారులు చాలామంది ఉన్నారు కానీ ఎందుకో ఎవరిని పూర్తిస్థాయిలో వాడుకోలేదేమో అనిపిస్తుంది.
టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే
మిక్కీ జే మేయర్ సంగీతం అంటే ఒకప్పుడు చాలా మంది అభిమానులు ఉండేవారు. కానీ ఈ సినిమాలో ఆయన స్థాయి సంగీతం రాలేదేమో అనిపిస్తుంది. అన్ని మంచి శకునములే అనే టైటిల్ సాంగ్ తప్ప బాగా రిజిస్టర్ అయ్యే సాంగ్స్ ఏమీ లేవు. అలాగే ఎమోషనల్ సీన్స్ లో కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతంత మాత్రమే చెప్పాలి. ఓవరాల్ గా మ్యూజిక్ ఈ సినిమాకి ఏమాత్రం ప్లస్ పాయింట్ అవ్వలేదు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ మాత్రం సినిమాకి మంచి అందాన్ని తీసుకొచ్చింది. ఎడిటర్ తన కత్తెరకు మరింత పని చెప్పి ఉంటే బాగుండేది. రెండున్నర గంటల పాటు సినిమా చూస్తున్న భావన కలిగిన పూర్తిస్థాయిలో ఇంకా ఏదో మిస్సయిన ఫీలింగ్ అయితే వదలదు. ప్రొడక్షన్స్ వాల్యూస్ మాత్రం అదిరిపోయాయి. ఎక్కడా ఏమాత్రం తగ్గకుండా సినిమా నిర్మాణం చేపట్టారు.
ఫైనల్ గా చెప్పాలంటే:
ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని మంచి శకునములే ఒక హానెస్ట్ అటెంప్ట్ కానీ బోర్ కొట్టిస్తుంది. అక్కడక్కడా బానే ఉన్నా సినిమాగా కనెక్ట్ అవడం కష్టం.
Rating: 2.25/5
Also Read: Aishwarya Rajesh: నేను రష్మికని ఏం అనలేదు.. ఐశ్వర్యా రాజేష్ క్లారిటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి