Ginna Day 2 Collections : మంచు విష్ణు జిన్నా మీద ప్రస్తుతం జరుగుతున్న ట్రోలింగ్ గురించి అందరికీ తెలిసిందే. మరీ నాసిరకం కథ, కథనాలతో వచ్చినా కూడా కామెడీ వర్కవుట్ అవ్వడంతో సినిమా మీద కాస్త పాజిటివ్ టాక్ వచ్చింది. మంచు విష్ణు కామెడీ టైమింగ్, వెన్నెల కిషోర్ చమ్మక్ చంద్ర ట్రాక్, సన్నీ లియోన్ కారెక్టర్ ఇలా అన్నీ కూడా కలిసి వచ్చాయి. కానీ సినిమాకు వస్తోన్న కలెక్షన్ల లెక్కలు చూస్తుంటే మాత్రం ట్రోలర్లకు పండుగలానే కనిపిస్తోంది. ఓవర్సీస్‌లో అయితే మరింత దారుణంగా ఉన్నట్టు కనిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హీరోలంతా వన్ మిలియన్ క్లబ్బులో జాయిన్ అయ్యేందుకు ట్రై చేస్తుంటే.. మన మంచు విష్ణు అన్న మాత్రం వన్ కే క్లబ్బులో జాయిన్ అయ్యేందుకు మూడు రోజులు తీసుకున్నాడు. అంటే కనీసం వెయ్యి డాలర్లు వసూల్ చేసేందుకు మూడు రోజులు పట్టిందన్న మాట. అలా జిన్నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జిన్నా పరిస్థితి మరింత ధీనస్థితిలో ఉంది.


శుక్రవారం విడుదలైన అన్ని సినిమాల్లో జిన్నా చివరన నిల్చుంది. సర్దార్, ప్రిన్స్, ఓరి దేవుడా ఇలా అన్ని సినిమాలకు ఓ మోస్తరు కలెక్షన్లు వస్తున్నాయి. సర్దార్ సినిమా ఫుల్లుగా ట్రాక్ ఎక్కేసింది. ఈ వీకెండ్ విన్నర్‌గా సర్దార్ నిల్చింది. జిన్నా డిజాస్టర్ కాబోతోంది. మొదటి రోజు పది నుంచి పన్నెండు లక్షల లోపు షేర్ సాధించి ట్రేడ్ వర్గాల మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఇక రెండో రోజూ సైతం అలాంటి కలెక్షన్లనే జిన్నా రాబట్టింది.


సర్దార్ సినిమా మొదటి రోజు 95 లక్షలు రెండో రోజు 1.05 కోట్ల షేర్ రాబట్టింది. ఓరి దేవుడా సినిమా ఫస్ట్ డే 90 లక్షలు, 66 లక్షల షేర్ సాధించింది. ప్రిన్స్ సినిమా ఫస్ట్ డేన 90 లక్షల షేర్, రెండో రోజున 46 లక్షల షేర్ రాబట్టింది. ఇక జిన్నా అయితే మొదటి రోజు పన్నెండు లక్షల షేర్, రెండో రోజు పది లక్షల షేర్ రాబట్టింది. ఇలా మొత్తంగా 22 లక్షల షేర్, నలభై లక్షల గ్రాస్ రాబట్టింది. ఈ లెక్కన బ్రేక్ ఈవెన్ అవ్వడం అసాధమని అర్థమవుతోంది. మొత్తానికి సర్దారు జోరు చూపిస్తుంటే.. జిన్నా బేజారవుతోంది.


నోట్: ఈ సమాచారం వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించినది, వీటిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించడం లేదు. 


Also Read : Prabhas బర్త్ డే.. ఆదిపురుష్‌ అప్డేట్ చూసి ఏడుస్తున్న అభిమానులు


Also Read : Ginna Colletcions: టాక్ బాగానే ఉన్నా షాకిస్తున్న కలెక్షన్స్.. విష్ణు కొంప ముంచిన ట్రోలర్లు!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook