Nani-Mahesh Babu: నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తాను నటించిన సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ.. అందరిలో సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాకి ముందు దసరా , హాయ్ నాన్న చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు నాని కెరియర్ లోనే తొలిసారి రూ.100 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా దసరా నిలిచింది.  శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించారు. అంతేకాదు ఈ చిత్రంతో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు నాని. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ సినిమా తర్వాత విడుదలైన హాయ్ నాన్న సినిమా కూడా డిస్టిబ్యూటర్లకు.. మంచి లాభాలను అందించింది. ప్రస్తుతం ఎస్ జె సూర్యతో కలిసి సరిపోదా శనివారం సినిమా చేస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా నాని.. మహేష్ బాబు పై పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. 


మహేష్ బాబు లాంటి హీరో పాన్ ఇండియా మార్కెట్లోకి ప్రవేశించడానికి ఒక మంచి సినిమాతో రావాలని ఆశించారు.అందుకు  తగ్గట్టుగానే రాజమౌళితో ఒక సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం అన్ని భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. నాని మాత్రం తన ప్రతి సినిమాను పాన్ ఇండియా సినిమానూ ఎందుకు విడుదల చేస్తున్నారు అని యాంకర్ అడగ్గా.. నాని ఆ ప్రశ్నకు షాకింగ్ సమాధానం ఇచ్చారు.


నాని మాట్లాడుతూ..’సినీ పరిశ్రమలోకి నేను వచ్చినప్పుడు ఎవరికీ తెలియదు. కానీ మహేష్ బాబు రావడమే సూపర్ స్టార్ గా ప్రవేశించారు. ఆయనకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. కానీ నాకు అంత అభిమానులు లేరు. ఒక పరిపూర్ణమైన సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెట్టాలని ఆయన భావించారు. ఆయన ఆలోచన సరైనదే. స్ట్రాటజీ కూడా సరైనదే కదా’ అంటూ తెలిపారు నాని. తన ప్రతి సినిమాకు ఆడియన్స్ ను పెంచుకుంటూ వెళ్లాలని, అందుకే తెలుగుతో  పాటు ప్రతిభాషల్లో కూడా తన సినిమా ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నానని అందుకే అలాగే చేస్తున్నానంటూ తెలిపారు. ప్రస్తుతం నాని చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.


Also Read: YS Jagan: తొలిసారి జగన్‌ విశాఖ పర్యటన.. సీఎంగా ప్రమాణం చేస్తానన్న చోట అధికారం కోల్పోయి


Also Read: Tirumala Water Problem: తిరుమలలో నీటి సంక్షోభం.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter