Sarkaru Vaari Paata Updates: సూపర్ స్టార్ మహేష్ బాబు అందం గురించి ఎంత పొగిడినా తక్కువే. 46 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తుంటాడు. మెయింటైన్ చేయలేక దూల తీరిపోతోందంటూ తనపై తానే సెటైర్లు కూడా వేసుకుంటాడు. వయసు పెరుగుతున్నకొద్ది మహేష్ అందం పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. సర్కారు వారి పాటలో మహేష్ మునుపటి కన్నా మరింత అందంగా, అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. మహేష్ అందం, ఆయన వ్యక్తిత్వంపై తాజాగా ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్‌లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహేష్ బాబు ప్రతీ రోజూ మూన్ ధాన్యం చేస్తారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్-లక్ష్మణ్ చెప్పారు. ఆయన ఒంటరితనాన్ని ఇష్టపడుతారని... ఒంటరిగా టెర్రస్‌పై కూర్చొని ధాన్యం చేస్తారని చెప్పారు. తద్వారా ఆయనలోని అంతరంగీక శక్తి పెరుగుతుందని అన్నారు. వృత్తి ధర్మం, సంసార ధర్మం, దేహ ధర్మం, సమాజ ధర్మం... ఈ నాలుగింటిని మహేష్ పక్కాగా పాటిస్తారని చెప్పారు. పని పట్ల వెయ్యి శాతం నిబద్దతతో ఉంటారని... కుటుంబాన్ని ప్రేమిస్తారని చెప్పారు. అలాగే తన శరీరం పట్ల తగిన శ్రద్ధ పెడుతారని... సమాజం పట్ల సేవా భావంతో ఉంటారని అన్నారు. 


ఈ నాలుగు ధర్మాలు పాటించే వ్యక్తిని ఎవరూ కదిలించలేరని రామ్, లక్ష్మణ్‌లు పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో సరిలేరు నీకెవ్వరు షూటింగ్ సమయంలో... అంత చలిలోనే ఉదయాన్నే లేచి మహేష్ వ్యాయామం చేసేవాడని చెప్పారు. షూటింగ్ తర్వాత అంతా అలసిపోయినా... ఆయన మాత్రం తప్పకుండా వ్యాయామం చేస్తారని చెప్పారు. మహేష్ లాంటి హీరోతో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు.


మహేష్ బాబు-కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట చిత్రానికి రామ్-లక్ష్మణ్‌లు ఫైట్ మాస్టర్స్‌గా వ్యవహరించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సుబ్బరాజు, వెన్నెల కిశోర్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మే 7న హైదరాబాద్ యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సర్కారు వారి పాట ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. 


Also Read: Shehnaaz Gill: సల్మాన్‌తో అంతలా రాసుకుని, పూసుకుని.. తాగిందా లేక... ఆ నటిపై విపరీతమైన ట్రోలింగ్


Also Read: Adi shankaracharya: నేడు ఆది శంకరాచార్య జయంతి... అద్వైత సిద్దాంతకర్త గూర్చి ఈ విషయాలు మీకు తెలుసా...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.