Save The Tigers 2: బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్.. ఇండియా టాప్ 3 లిస్టులో ‘సేవ్ ది టైగర్స్’
Save The Tigers 2 OTT Streaming: సేవ్ ది టైగర్స్ సీజన్ 2 వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఆడియన్స్‌ను అలరిస్తోంది. రెండు సీజన్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో మూడో సీజన్‌కు తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సేవ్ ది టైగర్స్ సీజన్ 2 రీసెంట్గా వచ్చిన వెబ్ సిరీస్‌ల్లో ఇండియా వైడ్‌గా టాప్ 3 లిస్టులో చేరింది.
Save The Tigers 2 OTT Streaming: అభివన్ గోమఘం, ప్రియదర్శి, చైతన్యకృష్ణ, జోర్దార్ సుజాత, దేవయాని శర్మ, పావని గంగిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన సేవ్ ది టైగర్స్-2 వెబ్ సిరీస్ ఆడియన్స్‌ను మెప్పిస్తోంది. 'సేవ్ ది టైగర్స్'కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ అంతకుమించి అనేలా అలరించింది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సిరీస్‌కు ఫిదా అయిపోయారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సేవ్ ది టైగర్స్-2 వెబ్ సిరీస్‌కు దక్షిణాదిలోనే కాకుండా.. ఇండియా వైడ్‌గా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ షోగా నిలిచిందని మేకర్స్ చెబుతున్నారు. ఓటీటీలో టాప్-3 సేవ్ ది టైగర్స్ షో సత్తా చాటింది.
ఈ సిరీస్‌ను ముందు నుంచి అన్నీ తానై నడిపించిన మహి వి.రాఘవ మాట్లాడుతూ.. ఇండియాలోని అన్ని ఓటీటీ మాధ్యమాల్లో వచ్చిన ఇటీవల వెబ్ సిరీస్‌ల్లో టాప్ 3 స్థానంలో సేవ్ ది టైగర్స్ నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆడియన్స్ పెద్ద విజయాన్ని అందించారని అన్నారు. రెండు సీజన్స్ సూపర్ హిట్ అవ్వడం సాధారణ విషయం కాదన్నారు. పెళ్లి, మానవ సంబంధాలను ఆధారంగా చక్కటి కథలకు తెర రూపం ఇస్తే.. మంచి విజయాలు సాధిస్తాయని దీంతో రుజువైందన్నారు. కామెడీ వెబ్ షోలను ఆడియన్స్ ఫ్యామిలీ చిత్రాలుగా భావిస్తారని నమ్మకం కుదిరిందన్నారు. సేవ్ ది టైగర్స్-2కు భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
సేవ్ ది టైగర్స్ రెండు సీజన్లకు వచ్చిన మంచి రెస్పాన్స్‌తో మరిన్ని సీజన్స్‌కు అవకాశం ఉందని నిరూపితమైంది. సీజన్ 3కి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. జూన్ నెల నుంచి సేవ్ ది టైగర్స్ సీజన్ 3 సెట్స్‌పై వెళుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఆసక్తి ఉన్న రచయితలు, ఫిల్మ్ మేకర్స్ వాకి స్క్రిప్ట్స్, ఐడియాస్‌ను తమకు పంపాలని మహి వి.రాఘవ్ నిర్మాణ సంస్థ త్రీ ఆటమ్ లీవ్స్ సంస్థ కోరుతోంది. వారు పంపిన ఐడియాస్, స్క్రిప్ట్స్ బాగుంటే.. సదరు రచయిత, ఫిల్మ్ మేకర్స్ సహకారంతో దాన్ని మరింత మెరుగ్గా చేసి రూపొందిస్తామని వెల్లడించింది.
మహి వి రాఘవ్ నిర్మాణ పర్యవేక్షణలో సేవ్ ది టైగర్స్-2కు అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించారు. సీజన్-1 మించి కామెడీతో అలరించేలా అన్ని ఎపిసోడ్స్‌ను డిజైన్ చేశారు. టీవీ ఛానెళ్లలో రెగ్యులర్ చూసే వైరల్ న్యూస్.. దాంతో ప్రతిస్పందించే ప్రజలు.. ఆ తరువాత జరిగే పరిణామాలను సెటైరికల్‌గా చూపించడం ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది. అసలు విషయం తెలుసుకునేలోపు ఎలాంటి నష్టం జరుగుతుందో చక్కగా వివరించారు. మహి వి రాఘవలో రచనలో డ్రామా ఆకట్టుకుంది.
Also Read: Anaparthi Seat: అనపర్తి అసమ్మతిపై చంద్రబాబు దిగొచ్చినట్టేనా, సీటు మార్చే ఆలోచన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitter సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి