Sayaji Shinde hospitalised: ప్రముఖ నటుడు షాయాజీ షిండే తీవ్రమైన గుండెపోటుతో ఆసుపత్రి పాలయ్యారు.  ఈ రోజు ఉదయం ఛాతిలో తీవ్రమైన నొప్పి  రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటీనా దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన్ని టెస్ట్ చేసిన డాక్టర్లు.. గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో బ్లాక్స్ ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. దీంతో డాక్టర్లు ఆయనికీ యాంజియో ప్లాస్టీ చేశారు. ప్రస్తుతం షాయాజీ షిండే ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. త్వరలోనే కొన్ని చికిత్సల తర్వాత ఆయన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు. గతంలో ఒకసారి ఆయనకు గుండెపోటుకు గురయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షాయాజీ షిండే విషయానికొస్తే.. మరాఠీ రంగస్థల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఏకపాత్రాభినయంలో ఈయనకు నటనకు మంచి పేరు తీసుకొచ్చింది. మరాఠీ రంగస్థల నటుడైన ఈయనకు తొలి అవకాశం వచ్చింది హిందీ సినిమాల్లోనే చెప్పాలి. ఈయన 1990లో తెరకెక్కిన 'దిశ' మూవీతో నటుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టారు.  ఆ తర్వాత మరాఠీలో పలు చిత్రాల్లో నటించారు. హిందీలో రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో తెరకెక్కిన 'శూల్' మూవీ ఈయనకు నటుడిగా బ్రేక్ తీసుకొచ్చింది. తెలుగులో 2002లో వి.వి.వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'ఠాగూర్' మూవీతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.
అంతేకాదు పరభాష నటుడైనా తన డబ్బింగ్‌ను  అన్ని భాషల్లో తానే చెప్పుకోవడం విశేషం. ఆ తర్వాత తెలుగులో అరుంధతి, వీరభద్ర, గుడుంబా శంకర్, ఆంధ్రావాలా, పోకిరి సినిమాలు నటుడిగా షాయాజీ షిండేకు మంచి పేరు తీసుకొచ్చాయి. కేవలం విలన్ పాత్రల్లోనే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్రాలతో మమేకమయ్యారు. ఈయన తమిళం, కన్నడ, గుజరాతి, భోజ్‌పురి, బెంగాలి, ఇంగ్లీష్ చిత్రాల్లో నటించి మెప్పించారు.


Also Read: KT Rama Rao: కాంగ్రెస్‌ అభ్యర్థిపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. 'పనికి రాని చెత్త'గా అభివర్ణన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter