Waltair Veerayya songs : మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ముందు నుంచీ డైరెక్టర్ బాబీ చెబుతున్నట్టుగా మాస్ మూలవిరాట్, పూనకాలు లోడింగ్ నిజంగానే జరిగాయి. వాల్తేరు వీరయ్యగా చిరంజీవి ఓ ముప్పై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లినట్టు అనిపిస్తోంది. గ్యాంగ్ లీడర్, ముఠామేస్త్రీ సినిమాలోని చిరంజీవిని చూసినట్టుగా అందరికీ అనిపించింది. మాస్ మ్యానరజింతో చిరంజీవి అదరగొట్టేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాల్తేరు వీరయ్య కోసం దేవీ శ్రీ ప్రసాద్ కూడా అదిరిపోయే పాటలను రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. టైటిల్ టీజర్‌లో ఆల్రెడీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో దుమ్ములేపేశాడు డీఎస్పీ. ఇక ఇప్పుడు సాంగ్స్‌తోనే మాస్‌ను ఊపేయబోతోన్నాడట. ఆల్రెడీ నాలుగైదు రోజుల క్రితం ఓ న్యూస్ బయటకు వచ్చింది. చిరంజీవి, రవితేజల మీద సాంగ్ షూటింగ్‌ చేస్తోన్నట్టుగా గాసిప్స్ వచ్చాయి. ఇప్పుడు వీటికి సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది. ఈ పాట థియేటర్లో పూనకాలు తెప్పింస్తుందట.


ఈ పాట కోసం శేఖర్ మాస్టర్‌ను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అనే పాటకు శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అందులో రామ్ చరణ్‌, చిరంజీవి కలిసి ఇద్దరూ ఐకానిక్ స్టెప్పులు వేశారు. ఇక ఇప్పుడు రవితేజ, చిరంజీవిల కోసం శేఖర్ మాస్టర్ అదిరిపోయే స్టెప్పులను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.


ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగబోతోంది. అయితే బాలయ్యతో చిరంజీవి సంక్రాంతికి పోటీ పడుతున్నట్టు కనిపిస్తోంది. కానీ పరిస్థితులు చూస్తుంటే.. ఈ రెండింటిలో ఏదో ఒకటి వెనక్కి వెళ్లేలా కనిపిస్తోంది. అదే గనుక జరిగితే బాలయ్య వీరసింహారెడ్డి వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే చిరంజీవి వాల్తేరు వీరయ్య సంక్రాంతి రాబోతోన్నట్టుగా ఎప్పుడో ప్రకటించేశారు. బాలయ్య సినిమాను ఈ మధ్యే సంక్రాంతికి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ రెండు సినిమాలను నిర్మించింది కూడా మైత్రీ మూవీస్ కావడం విశేషం.


Also Read : Yashoda Movie First Review : లోలోతుల్లో తడిమేశావ్!.. సమంత యశోద రివ్యూ చెప్పిన తమన్


Also Read : Bigg Boss Sreemukhi Photoshoot : ప్యాంట్ మరిచిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫోటోలతో హీట్ పెంచేస్తోన్న శ్రీముఖి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook