Comedian Visweswara Rao: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు మృతి
Visweswara Rao Passed Away In Chennai: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. తెలుగు హాస్య నటుడు అనారోగ్యంతో కన్నుమూశారు. వందలకుపైగా సినిమాల్లో నటించిన ఆయన మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.
Comedian Visweswara Rao: వందల సినిమాల్లో తన నటనతో నవ్వించిన సీనియర్ హాస్య నటుడు విశ్వేశ్వర్ రావు (62) అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశాడు. పుట్టింది ఏపీలోనైనా తమిళనాడులోని చెన్నైలో స్థిరపడ్డారు. చెన్నైలోని సిరుశేరులోని నివాసంలో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. విశ్వేశ్వర్ రావు మరణంతో హాస్యనటులతోపాటు ఇతర సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి మృతికి సంతాపం తెలిపారు. మరికొందరు నటీనటులు అతడి నివాసానికి చేరుకుని అంజలి ఘటించారు. సాయంత్రం అతడి అంత్యక్రియలు జరిగినట్లు సమాచారం.
Also Read: Fire Accident: దంచికొడుతున్న ఎండలు.. కాలిబూడిదైన రూ.10 కోట్ల ఆహార పదార్థాలు
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జన్మించిన విశ్వేశ్వరరావు బాల్యం నుంచే సినిమాల్లో నటించడం ప్రారంభించారు. బాల్యంలోనే వందల సినిమాల్లో నటించి ప్రతిభ కనబర్చారు. బాలనటుడిగా విశ్వేశ్వరరావు దాదాపు 150 చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ చిత్రాల్లో హాస్య నటుడిగా గుర్తింపు పొందారు. ఆయన ఇప్పటివరకు 350కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. పాత తరం నుంచి నేటితరం హీరోహీరోయిన్లతో కలిసి ఆయన నటించడం విశేషం. సీనియర్ ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత, చిరంజీవి, రజనీకాంత్, నాగార్జున, పవన్‌కల్యాణ్ తదితర దిగ్గజ హీరోలతో కలిసి పని చేశారు.
Also Read: CSK Fan Died: ఐపీఎల్‌లో విషాదం.. రోహిత్ శర్మ ఔట్‌పై వివాదం.. సీఎస్కే అభిమాని మృతి
కొన్ని సినిమాలు విశ్వేశ్వరరావుకు గుర్తింపు తీసుకువచ్చాయి. ఆమెకథ, ముఠామేస్త్రీ, బిగ్‌బాస్, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, ఆయనకు ఇద్దరు, ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి, మెకానిక్ అల్లుడు, శివపుత్రుడు, శివాజీ తదితర సినిమాల్లో విశ్వేశ్వరరావు కీలక పాత్రలో కనిపించారు. నటుడిగా కొనసాగుతూనే దర్శకుడిగా, నిర్మాతగాను విశ్వేశ్వరరావు వ్యవహరించారు. అనారోగ్యం కారణంగానే సినిమాలకు దూరమైన ఆయన యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నారు. విస్సు టాకీస్ పేరుతో యూట్యూబ్ నిర్వహిస్తున్న విశ్వేశ్వరరావు కేవలం తమిళంలో మాత్రమే వీడియోలు చేస్తున్నారు. తెలుగులో కన్నా ఆయనకు తమిళంలో అధిక గుర్తింపు లభించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook