Sensation creates Tollywood song: యాంకర్‌గా తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్రవేసుకున్న ప్రదీప్ మాచిరాజు ( Pradeep Machiraju )  హీరోగా.. అమృతా అయ్య‌ర్ (Amritha Aiyer) హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ ( 30 Rojullo Preminchadam Ela )  అప్పట్లో ఈ టైటిల్‌ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకోవడంతోపాటు.. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా అనే పాట ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు ముందే నీలి నీలి ఆకాశం పాట రికార్డులను క్రియేట్ చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఈ పాట‌కు ఇప్ప‌టివ‌ర‌కు 200 మిలియ‌న్ల వ్యూస్ ( 20 కోట్లు ) వ‌చ్చాయి. ఓ సినిమా విడుద‌ల కాక‌ముందే..ఇలాంటి ఘ‌న‌త సాధించిన తొలి సౌతిండియా సినిమాగా ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా.?’ రికార్డుల‌కెక్కింది. అయితే ఈ సినిమాలోని 'నీలి నీలి ఆకాశం..' అనే పాటను జనవరి 31న విడుదల చేశారు. అప్పటినుంచి ఈ పాటకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు ఈ వీడియో పాటకు లక్షా 66వేల లైకులు వచ్చాయి. Also read: Bigg Boss Telugu: సీజన్-4 ప్రోమో విడుదల


నీలి నీలి ఆకాశం ఇద్దామ‌నుకున్నా..అంటూ సాగే హిట్ ట్రాక్‌కు చంద్ర‌బోస్ లిరిక్స్ అందించగా.. సిద్ శ్రీరామ్ ( Sid Sriram ), సునీత పాడారు. అనూప్ రూబెన్స్ (Anup Rubens) సంగీతం స‌మ‌కూర్చారు. ఈ సినిమాకు మున్నా దర్శకత్వం వహిస్తుండగా.. నిర్మాతగా ఎస్‌వీ బాబు వ్యవహరిస్తున్నారు. Also read: Bigg Boss 4: పూనమ్‌ కౌర్‌ను బిగ్‌బాస్ రిజెక్ట్ చేశారని ప్రచారం.. నిజమేంటి?