Actor Aparna P Nair death: మలయాళ టీవీ నటి అపర్ణా పి.నాయర్‌ (Aparna P Nair) (31) తన ఇంట్లో శవమై కనిపించింది. 31 ఏళ్ల అపర్ణా తిరువనంతపురంలోని తన నివాసంలో గురువారం సాయంత్రం ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అపర్ణ మృతికి గల కారణాలు తెలియరాలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. శవ పంచనామా అనంతరం మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. అపర్ణ మృతి అభిమానులను, సినీ ప్రముఖులను దిగ్భ్రాంతికి గురి చేసింది. కుటుంబ తగాదాలే ఆమె మృతికి కారణంగా తెలుస్తోంది.  ఆమె మరణానికి ముందు తన చిన్న కుమార్తె ఫోటోతోపాటు వీడియోను ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు. 


అపర్ణ పలు మలయాళ సీరియల్స్‌లో నటించారు. ‘చందనమాల’, ‘ఆత్మసఖి’, మైథిలీ వీందుం వరుమ్, ‘దేవస్పర్శమ్’ వంటి ధారావాహికలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆమె పలు సినిమాల్లో నటించి మెప్పించారు.‘మేఘతీర్థం’, ‘కల్కి’, మత్కుగౌ, అచ్చయన్స్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అపర్ణకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమె తెలుగులో చిన్ని చిన్న ఆశ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అపర్ణ మరణంపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Kushi Movie OTT: ఓటీటీలోకి ఖుషి మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడ అంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook