Jawan Fighting Sequence Leaked బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా యూనిట్‌కు షాక్ తగిలినట్టు అయింది. షారుఖ్ ఖాన్ అదిరిపోయేలా చేస్తోన్న యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన పుటేజ్ లీక్ అయింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి షారుఖ్ యాక్షన్ సీక్వెన్స్‌ చేస్తోన్న వీడియో బయటకు వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలే ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఫుల్ ఫాంలోకి వచ్చాడు. ఒక్క పఠాన్ సినిమాతో పాతాళంలో పడిపోయి ఉన్న బాలీవుడ్‌ను మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఇక తన పని అయిపోయిందని అనుకున్న వారందరికీ కూడా తన సత్తా ఏంటో చూపించాడు షారుఖ్ ఖాన్.


ఒక్క పఠాన్ సినిమా ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా నిలిచింది. షారుఖ్‌ స్టామినా ఏంటో చూపించింది. ఇది ఏకంగా బాలీవుడ్‌లో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. చివరగా బాహుబలి హిందీ రికార్డులను సైతం టచ్ చేసింది. ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసి బాలీవుడ్ హీరోల సత్తాను చాటినట్టు అయింది.


ఇప్పుడు షారుఖ్ ఖాన్ రెట్టింపు వేగంతో దూసుకుపోతోన్నాడు. జవాన్ సినిమా, డుంకీ చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు జవాన్ సినిమా యూనిట్‌కు షాక్ తగిలింది. అట్లీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.


అయితే ఇప్పుడు ఆ యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన పుటేజ్ లీక్ అయింది. నెట్టింట్లో షారుఖ్ ఖాన్ ఫైటింగ్ విజువల్స్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ సినిమా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. షారుఖ్ మొదటి సారిగా ఇలా సౌత్ డైరెక్టర్‌తో మాస్ మసాజలా కమర్షియల్ సినిమా కోసం పని చేస్తున్నాడు.


Also Read:  Anupama Photos : అనుపమా.. అందానికి చిరునామా?.. ఎన్ని వింత భంగిమలో.. పిక్స్ వైరల్


Also Read: Ram Charan : పదేళ్లుగా ఎంతో ఎదురుచూశాం!.. తండ్రి కాబోతోండటంపై రామ్ చరణ్‌ కామెంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook