Shah Rukh Khan FIR : షారుఖ్ ఖాన్ మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న నెటిజన్.. వద్దని వేడుకున్న బాలీవుడ్ బాద్ షా
Shah Rukh Khan Fun Chit Chat షారుఖ్ ఖాన్ తాజాగా అభిమానులతో ముచ్చట్లు పెట్టాడు. ఎప్పుడూ అడగనివి, అడగకూడదని అనుకున్నవి ఇప్పుడు అడగండి.. అలాగని నెగెటివ్ కామెంట్లు, పిచ్చి మాటలు, పర్సనల్‌గా అడగకండి అని కోరాడు.
Shah Rukh Khan Fun Chit Chat బాలీవుడ్ బాద్ షా ఇప్పుడు ఫుల్ ఖుషీలో ఉన్నాడు. పఠాన్ సినిమాకు వస్తోన్న కలెక్షన్లు చూసి బాలీవుడ్ గాల్లో తేలిపోతోంది. బాలీవుడ్‌కు మళ్లీ పూర్వ వైభవం వచ్చిందని అక్కడి వారంతా కూడా సంబరపడిపోతోన్నారు. అయితే బాలీవుడ్, షారుఖ్ ఖాన్‌కు కమ్ బ్యాక్‌లా కలిసి వచ్చిన పఠాన్ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. వెయ్యి కోట్లకు దగ్గర్లో పఠాన్ సినిమా ఉంది. ఇక రేపో మాపో వెయ్యి కోట్ల మార్క్ దాటేట్టు కనిపిస్తోంది.
షారుఖ్ తన సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఫుల్ ఫాంలోకి వచ్చాడు. సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అవుతున్నాడు. ఇప్పటికే ట్విట్టర్‌లో చాలా సార్లు షారుఖ్ ఖాన్ తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు. #ASKSRK పేరిట ఎన్నో సార్లు చిట్ చాట్ చేశాడు. అభిమానులకు తన స్టైల్లో సమాధానాలు ఇచ్చాడు.
ఇప్పుడు కూడా అదే పని చేశాడు. అయితే ఈసారి కాస్త ఫన్నీగా పెట్టాడు. ఏ విషయాలైనా అడగండని, కానీ పర్సనల్ వెళ్లొద్దని, బూతులు వద్దని, నెగెటివ్ వద్దని వేడుకున్నాడు. అయితే నెటిజన్లు మాత్రం షారుఖ్‌ను సరదాగా ఆట పట్టించే ప్రశ్నలు వేశాడు. మీకు పెట్స్ అంటే ఇష్టం లేదా? మీరు ఇంత వరకు పెట్‌తో ఉన్న ఫోటోలు బయటకు రాలేదు అని అడిగాడు.
నాకు పెట్స్ ఉన్నాయ్. కానీ ఫోటోలు ఎప్పుడూ బయటపెట్టలేదు.. ఎందుకంటే అవి నాకంటే ఎక్కువగా ఫేమస్ అవుతాయని అలా ఫోటోలను బయటపెట్టలేదు అని ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. పఠాన్ సినిమాలో ఏ సీన్ చేయడం చాలా కష్టంగా అనిపించింది అని ఇంకో నెటిజన్ అడిగాడు.
షర్ట్ లేకుండా బాడీ చూపిస్తూ చేయాల్సిన సీన్‌కు కష్టంగా అనిపించింది.. అక్కడంతా చలిగా ఉందని, అయినా కూడా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇక ఇంకో నెటిజన్ అయితే షారుఖ్ సిక్స్ ప్యాక్‌ను చూపిస్తూ.. మీరు 57 ఏళ్లు అని తప్పుగా చెబుతున్నారు.. ఇలా అబద్దాలు చెబుతున్నందుకు మీ మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి అని అన్నాడు.
వద్దు వద్దు నా మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకండి.. నా వయసు ఇంకా ముప్పై ఏళ్లే.. అందుకే జవాన్ అనే సినిమాను చేస్తున్నాను.. అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి షారుఖ్ మాత్రం తన అభిమానులతో ఇలా సరదాగా టైం పాస్ చేసేశాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook