Jawan Movie Advance bookings open: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ (Shah Rukh Khan) లేటెస్ట్ మూవీ జవాన్‌’(Jawan). అట్లీ (Atlee) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నయనతార, విజయ్ సేతుపతి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె గెస్ట్ రోల్స్ లో కనిపించనున్నారు. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (Red Chillies Entertainments) సమర్పణలో గౌరీ ఖాన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సెప్టెంబరు 07న రిలీజ్ కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ (Jawan Movie Advance bookings)కు సంబంధించి సాలిడ్ అప్‌డేట్‌ను ప్రకటించారు మేకర్స్.  ఈ సినిమా బుకింగ్స్ ఈరోజు ఉద‌యం 10 గంట‌ల నుంచి స్టార్ట్ అయినట్లు మేకర్స్ వెల్లడించారు. పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 7న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీకి అనురుధ్ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు. 


ఈ సినిమా ప్రిరిలీజ్ బిజినెస్ సైతం బాగానే జరుగుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు జవాన్ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్ సినిమాపై భారీగా హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా రిలీజైన ట్రైలర్ అయితే యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది. జవాన్ మూవీ ట్రైలర్‌లో దర్శకుడు అట్లీ ఎగ్జైటింగ్ సీన్స్ పెట్టి జవాన్ మూవీపై అంచనాలను పెంచేశాడు. 


Also Read: Jawan Trailer Review in Telugu: ఎంతో ఎదురుచూసిన ' జవాన్ మూవీ ట్రైలర్ ' ఎలా ఉందంటే...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి