Pathaan Teaser: షారుక్ వాయిస్ ఓవర్‌తో `పఠాన్` టీజర్.. కీలకపాత్రల్లో జాన్ అబ్రహం, దీపికా పదుకొనే..
Pathaan Teaser: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ లేటెస్ట్ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ మేరకు పఠాన్ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Shah Rukh Khan's Pathaan Teaser: మూడేళ్ల తర్వాత బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటిస్తున్న చిత్రం 'పఠాన్' (Pathaan Movie). ఇందులో జాన్ అబ్రహం, దీపికా పదుకొనె కీలకపాత్రలు పోషించారు. తాజాగా వీరి పాత్రలను పరిచయం చేస్తూ..షారుఖ్ వాయిస్ ఓవర్ తో టీజర్ (Pathaan Teaser) రిలీజ్ చేశారు మేకర్స్. దీనిని షారుఖ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.."ఆలస్యమైందని నాకు తెలుసు.. అయితే ఈ తేదీని గుర్తుంచుకోండి... పఠాన్ సమయం ఇప్పుడే మొదలవుతుంది... 25 జనవరి, 2023న బిగ్ స్క్రీన్‌పై కలుద్దాం'' అంటూ రాసుకొచ్చాడు. ఈ చిత్రాన్ని హిందీ, తమిళం, తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇది యష్‌రాజ్ ఫిల్మ్స్‌లో 50వ సినిమాగా తెరకెక్కుతోంది.
షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) చివరిసారిగా 2018లో అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌లతో కలిసి జీరో చిత్రంలో నటించారు. ఆ తర్వాత నిర్మాతగా బిజీ అయ్యారు. బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తూ, నిర్మాణంలోనూ పాలు పంచుకుంటున్న చిత్రం ‘డార్లింగ్స్. ఈ చిత్రానికి షారుఖ్ సహ నిర్మాతగా వ్యవహారించాడు. అభిషేక్ బచ్చన్ టైటిల్ రోల్‌లో నటించిన బాబ్ బిస్వాస్ చిత్ర నిర్మాణంలో కూడా షారుఖ్ పాలు పంచుకున్నాడు. అంతేకాకుండా బాబీ డియోల్, సన్యా మల్హోత్రా, విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రల్లో నటించిన 'లవ్ హాస్టల్' చిత్రానికి కూడా షారుఖ్ ఖాన్ తన సపోర్టు ఇచ్చాడు. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 (Zee5)లో ఫిబ్రవరి 25న విడుదలైంది.
Also Read: Radhe Shyam Trailer: రాధేశ్యామ్ మూవీ రెండో ట్రైలర్ వచ్చేసింది..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook