Jawan OTT And Satellite Rights: షారుఖ్‌ఖాన్ టైటిల్ రోల్ చేసిన జ‌వాన్ మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌క‌లు ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది అట్లీ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు రిలీజ్‌కు ముందే యాభై కోట్ల‌కుపైగా అడ్వాన్స్ బుకింగ్స్ జ‌రిగాయి. ఇందులో పఠాన్ రికార్డ్స్ ను సైతం జవాన్ బ్రేక్ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ హక్కులు కోసం చాలా ఓటీటీ సంస్థలు పోటీపడినప్పటికీ.. చివరకు రూ.120 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు సొంతం చేసుకుంది. అక్టోబ‌ర్ చివర్లో లేదా నవంబ‌ర్ మెుదటి వారంలో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. 


పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజ్ అవుతున్న షారుఖ్‌ఖాన్ సినిమా ఫస్ట్ డే భారీగా కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది. ఈ మూవీకి ఉన్న హైప్, అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువగా జరగడంతో ఈ సినిమా తొలి రోజు రూ.150 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది. ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టించాడు. ఇందులో దీపికా పదుకొనె, సంజయ్ దత్ గెస్ట్ రోల్స్ లో, ప్రియమణి, సాన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగిబాబు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. మ్యూజిక్ సెన్షెషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 


Also Read: Jawan Movie Review: షారుక్ 'జవాన్' సినిమా హిట్టా? ఫట్టా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి