శైలజా రెడ్డి అల్లుడు ట్రైలర్
శైలజా రెడ్డి అల్లుడు ట్రైలర్
భలే భలే మగాడివోయ్, బాబు బంగారం, మహానుభావుడు వంటి కామెడి హిట్స్ అందించిన మారుతి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా ట్రైలర్ ఆడియెన్స్ ముందుకొచ్చేసింది. చైతూ సరసన అను ఎమ్మాన్యుయెల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యక్రిష్ణ చైతూకి అత్త పాత్రలో నటిస్తోంది. వాస్తవానికి ఆగస్టు 29నే రిలీజ్ కావాల్సి ఉన్న ఈ ట్రైలర్ ప్రముఖ సినీ నటుడు నందమూరి హరికృష్ణ అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో అతడిని స్మరించుకుంటూ ఈ ట్రైలర్ విడుదలను వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. అయితే, సెప్టెంబర్ 13న వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుండటంతో ఇక మధ్యలో ఎక్కువ వ్యవధి లేదనే ఉద్దేశంతో తాజాగా నిర్మాతలు శైలజా రెడ్డి అల్లుడు ట్రైలర్‌ని విడుదల చేశారు. మరి మారుతి తన గత చిత్రాల మాదిరిగానే శైలజా రెడ్డి అల్లుడుతో ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేస్తాడా లేదా అనేది తెలియాలంటే సినిమా రిలీజయ్యే వరకు వేచిచూడకతప్పదు.