Shalini Pandey: బ్లాక్ అవుట్ ఫిట్‌లో షాలిని పాండే మెరుపులు.. చక్కనమ్మ చిక్కినా అందమే మరి!
Shalini Pandey Hot Photos: అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి పాత్రలో మెరిసిన షాలిని పాండే ఇప్పుడు తెలుగులో సినిమాలో అవకాశాలు దక్కించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తోంది.
Shalini Pandey Hot Photos: జబల్పూర్ లో పుట్టి పెరిగిన షాలిని పాండే ఎలా అయినా సినిమాల్లో రాణించాలి అనే ఉద్దేశంతో తొలుత ముంబై వచ్చి చేరింది. ఆ తర్వాత ముంబైలోనే హిందీ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కంటపడి అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి పాత్రలో మెరిసింది. చేసిన మొదటి సినిమాకి అద్భుతమైన స్పందన తెచ్చుకున్న ఈ భామ ఆ తరువాత పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది.
హిందీలో ఒక అతిధి పాత్రలో నటించిన ఆ తర్వాత మహానటిలో సుశీల పాత్రలో మెరిసింది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో షావుకారు జానకి పాత్రలో కనిపించిన తర్వాత కళ్యాణ్ రామ్ సరసన 118 అనే సినిమా చేసింది. కానీ ఆ సినిమా హిట్ కాలేదు. తమిళ్ లో 100% లవ్ రీమేక్ చేసింది. కానీ ఆ సినిమా కూడా ఆమెకు మంచి క్రేజ్ అయితే తీసుకురాలేదు. తర్వాత ఇద్దరి లోకం ఒక్కటే, నిశ్శబ్దం వంటి సినిమాల్లో కనిపించింది కానీ ఆ సినిమాలు ఏవి ఆమెకు కలిసి రాలేదు.
ప్రస్తుతం ఆమె హిందీలో ఒక సినిమా చేస్తోంది. అయితే తెలుగు సినీ పరిశ్రమ ద్వారా ప్రపంచానికి పరిచయమైన ఇప్పుడు తెలుగులో సినిమాలో అవకాశాలు దక్కించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. గతంలో కాస్త బొద్దుగా ఉండే ఈ భామ ఇప్పుడు పూర్తిస్థాయిలో బక్క చిక్కి కనిపిస్తోంది. బక్క చిక్కడమే కాక అందాల ఆరబోసేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. మొదటి సినిమాలో బోల్డ్ గా కనిపించిన ఈ భామ తర్వాత ఎందుకు బోల్డ్ పాత్రలకు కాస్త దూరంగా ఉంటూనే వచ్చింది.
కానీ తాజాగా ఆమె షేర్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోషూట్ ఆసక్తి రేపుతోంది. అలెక్సా ప్లే ఎ జాజ్ సాంగ్ అంటూ క్యాప్షన్ పెట్టిన శాలిని పాండే బ్లాక్ అవుట్ ఫిట్ లో కనిపిస్తూ చేతులు రెండు అలా పైకెత్తి ఒక శిల్పంలా హొయలు పోతోంది. చాలా కాలం తర్వాత బక్క చిక్కిన ఆమె అందాల ఆరబోయడం ఆసక్తికరంగా మారింది. ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి రెండు మూడు వారాలకు పైనే అవుతుంది. ఈ నేపద్యంలో ఆమె షేర్ చేసిన ఫోటోలు చూసి ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Liger: క్రాస్ బ్రీడ్ లైగర్ వచ్చేస్తున్నాడు.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
Read Also: Ravi Teja In Mega 154: మెగా 154లో రవితేజ, మాస్ మహారాజా ఊర మాస్ ఎంట్రీ..ఇక రచ్చరచ్చే!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook