Game Changer Update: 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో… తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమాపై.. అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. శంకర్ మాత్రం సినిమాకి సంబంధించి అప్డేట్లు ఇవ్వడం లేదు. కమల్ హాసన్ హీరోగా.. భారతీయుడు 2 సినిమా షూటింగ్, విడుదల విషయాల్లో బిజీగా ఉన్న.. శంకర్ గేమ్ చేంజర్.. గురించి పట్టించుకోలేదు. 


దీంతో రామ్ చరణ్ అభిమానులు శంకర్ పై.m తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న శంకర్ కి.. గేమ్ చేంజర్ కి సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఇక ఎట్టకేలకి డైరెక్టర్ శంకర్ గేమ్ చేంజర్ సినిమాకి.. సంబంధించిన ప్రశ్నలు గురించి స్పందించారు. 


ముందుగా సినిమా షూటింగ్ గురించి.. మాట్లాడుతూ ఇంకా పది పదిహేను రోజుల.. షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని క్లారిటీ ఇచ్చారు. భారతీయుడు 2 సినిమా రిలీజ్ వెంటనే.. ఆ షూటింగ్ కూడా పూర్తి చేసేస్తానని చెప్పుకొచ్చారు. ఇక రామ్ చరణ్ లాంటి యంగ్ జనరేషన్ యాక్టర్ తో.. పనిచేయడం ఎలా అనిపించింది అని అడగగా.. శంకర్ అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని.. చాలా బాగా ఎంజాయ్ చేశనని అన్నారు.


బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ.. ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. గతంలో రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో కనిపించిన కియారా.. మళ్లీ ఇన్నాళ్ళకి చెర్రీ తో రొమాన్స్ చేయనుంది. అంజలి, ఎస్ జే సూర్య, శ్రీకాంత్, జయరాం, సునీల్, సముతిరఖని తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. 


కార్తీక్ సుబ్బరాజ్ స్క్రీన్ ప్లే.. అందించిన ఈ సినిమాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో.. కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన జరగండి పాటకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. 


మరోవైపు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2 సినిమా జులై 12న థియేటర్లలో విడుదల కాబోతోంది. 1996లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. సిద్ధార్థ, ఎస్ జే సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, బాబి సింహ, వివేక్, ప్రియ భవాని శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు.


Also read: Reliance Jio New Plans: జియో నుంచి మల్టీ లాంగ్వేజ్ యాప్ సహా కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్స్ లాంచ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter