Shankar Planning a Film Like Bahubali with Ranveer Singh: సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తో అపరిచితుడు సినిమాకి సంబంధించిన బాలీవుడ్ వర్షన్ రూపొందిస్తారని గతంలో ప్రచారం జరిగింది. అంతేకాదు నిజానికి ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే ఆ ప్రకటన వచ్చిన తర్వాత శంకర్ కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా ప్రారంభించడం, ఆ తర్వాత అనుకోని కారణాలతో ఆ సినిమా ఆగిపోవడంతో రాంచరణ్ తో రామ్ చరణ్ 15 సినిమా ప్రారంభించడం అందరికీ తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దిల్ రాజు ప్రొడక్షన్ రూపొందుతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతానికి రామ్ చరణ్ 15వ సినిమాని కూడా పక్కనపెట్టి ఆయన ఇండియన్ 2 సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు శంకర్ కి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. అదేమిటంటే రణవీర్ సింగ్ తో కలిసి శంకర్ ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. తమిళంలో సూపర్ గా ఫేమస్ అయిన వేల్పారి అనే ఒక నవల ఆధారంగా మూడు భాగాలతో కూడిన ఒక బాహుబలి లాంటి సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు.


త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని షూటింగ్ 2023వ సంవత్సరంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే అపరిచితుడు రీమేక్ సంగతి ఏమైంది అనే విషయం మీద మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. కానీ బాహుబలి లాంటి సినిమాని కొట్టే సినిమా ఇప్పటివరకు రాలేదు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లాంటి సినిమాలు వచ్చాయి కానీ అవి వేరే జానర్ సినిమాలు కావడంతో బాహుబలి లాంటి కథతో రావడానికి ప్రయత్నించి పొన్నియన్ సెల్వన్ అనే సినిమాతో మణిరత్నం ఆ ఫీట్ అందుకోలేకపోయారు.


అయితే తెలుగు ప్రేక్షకులు పొన్నియన్ సెల్వన్ సినిమాను పెద్దగా ఆదరించలేదు. ఇక తమిళ ప్రేక్షకులు బాగానే ఆదరించడంతో ఆ సినిమాకు 400 కోట్ల రూపాయల దాకా కలెక్షన్స్ వచ్చాయి. అయితే హిందీ తెలుగు ఆడియన్స్ కూడా పొన్నియన్ సెల్వన్ సినిమాని అర్థం చేసుకొని ఆదరించి ఉంటే ఆ సినిమా కలెక్షన్స్ మారో లెవల్ లో ఉండేవని అంటున్నారు. అయితే ఇప్పుడు రణవీర్ సింగ్ తో శంకర్ వేల్పరి సినిమా చేయబోతున్నారనే వార్త అటు బాలీవుడ్ వర్గాల్లో ఇటు తమిళ సినీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వెలబడుతుందో చూడాల్సి ఉంది.
Also Read: Sobhu Yarlagadda on KTR: కేటీఆర్ అప్పుడూ కూలే, ఇప్పుడూ కూలే.. బాహుబలి నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్!


Also Read: VD in Brahmastra 2: బ్రహ్మాస్త్ర 2లో కీలక పాత్ర కోసం విజయ్ దేవరకొండ.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook