Shankar Shanmukgham indian 2 శంకర్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడన్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ ఇండియన్ 2, రామ్ చరణ్‌ గేమ్ చేంజర్‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు శంకర్. నెలలో సగం రోజులు ఆ సినిమా, మిగిలిన సగం రోజులు ఈ సినిమా అంటూ బిజీగా ఉంటున్నాడు శంకర్. అయితే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఇండియన్ 2 షెడ్యూల్‌ను శంకర్ పూర్తి చేశాడు. ఇక వెంటనే రామ్ చరణ్‌ గేమ్ చేంజర్ సినిమాతో బిజీ కానున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మామూలుగా అయితే ఇండియన్ 2 సినిమాను ఆపేశారు. ప్రమాదాలు జరగడం, శంకర్ కమల్ హాసన్ మధ్య విబేధాలు రావడం, ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుండటం, కరోనా రావడం ఇలా ఎన్నో కారణాలతో ఆ సినిమాను పక్కన పెట్టేశారు. దాని తరువాత శంకర్ తన కొత్త సినిమా గురించి పనులు మొదలుపెట్టేశాడు. ఆ క్రమంలోనే కార్తిక్ సుబ్బరాజు కథ మీద శంకర్ ఫోకస్ పెట్టాడు.


 



ఇండియన్ 2 సినిమాను దిల్ రాజు భాగస్వామిగా తెరకెక్కించాల్సింది. కానీ ఆ ప్రాజెక్ట్ చేజారిపోయింది. అందుకే శంకర్ తనకు నచ్చిన ఆ కథను దిల్ రాజు వద్దకు తీసుకొచ్చాడు. అలా ఈ కథలోకి రామ్ చరణ్‌ ఎంట్రీ ఇచ్చాడు. గేమ్ చేంజర్‌గా సినిమాను మలిచాడు. ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వచ్చిన లీకులు, ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.


Also Read:  Ileana D'cruz : తల్లి కాబోతోన్న ఇలియానా?.. హీరోయిన్ పోస్ట్‌పై కామెంట్లు.. తండ్రి ఎవరంటూ ట్రోల్స్


రామ్ చరణ్‌ సినిమాతో శంకర్ బిజీగా ఉన్న సమయంలోనే.. మళ్లీ ఇండియన్ 2 మొదలు పెట్టాల్సి వచ్చింది. విక్రమ్‌తో కమల్ హాసన్ ఫాంలోకి రావడంతో.. ఇండియన్ 2 పట్టాలెక్కింది. దీంతో నెలలో సగం రోజులు కమల్ హాసన్ సినిమాకు, మిగిలిన సగం రోజులు రామ్ చరణ్‌ సినిమాకు కేటాయించాడు శంకర్. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఇండియన్ 2 షెడ్యూల్‌ను శంకర్ పూర్తి చేశాడు. ఇదే విషయాన్ని ట్వీటేసి చెప్పాడు శంకర్. నెక్ట్స్ క్లైమాక్స్ అని, ఇండియన్ 2 నుంచి గేమ్ చేంజర్ అని ట్వీట్ వేశాడు.


Also Read: Saif Ali Khan Joins NTR 30 : ఎన్టీఆర్ కోసం రంగంలోకి సైఫ్ ఆలీ ఖాన్.. స్టిల్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook