Manamey Trailer Talk: శర్వానంద్-కృతి శెట్టి ఇద్దరికీ కూడా ప్రస్తుతం విజయం సాధించడం ఎంతో అవసరం. ప్రస్తుతం మీరు ఇద్దరు హీరో హీరోయిన్లుగా వస్తోన్న సినిమా మనమే. టైటిల్ కి తగ్గట్టుగానే ఈ చిత్రకథ మనందరి కథలా అనిపిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ ఈరోజు విడుదలై ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్రైలర్ విషయానికి వస్తే ఇందులో.. ఒక చిన్న బాబు ఉండగా.. ఆ బాబుని ఎంతో బాధ్యతగా చూసుకునే పాత్రలో కృతి శెట్టి.. కొంచెం కేర్ లెస్ గా ఉండే పాత్రలో శర్వానంద్ కనిపించారు. అయితే వీరిద్దరూ ఆ బాబుకి అమ్మానాన్న.. కాదా.. అనే క్లారిటీ మాత్రం ఈ ట్రైలర్ ఇవ్వలేదు. అంతేకాకుండా కనీసం వీరిద్దరూ భార్యాభర్తల లేక ఏదన్నా ఒక విషయం వల్ల ఇలా ఆ బాబు జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చిందా అనే క్లారిటీ కూడా ఈ ట్రైలర్ ఇవ్వలేదు. కానీ మొత్తం పైన పిల్లల్ని చాపడం ఎంత కష్టం.. వారి విషయంలో ఎంత బాధ్యతగా ప్రవర్తించాలి అనే విషయాలను మాత్రం చూపించారు. శర్వానంద్ ఈ సినిమాలో కామెడీ బాగా పండించనున్నారు.. అని అర్థమవుతోంది. ముఖ్యంగా తనికెళ్ల భరణి “పిల్లల్ని చకడం యూట్యూబ్లో చూపించే అంత ఈజీ కాదు..’ అని చెప్పే డైలాగ్.. చివరిలో శర్వానంద్ 10 ml నీకు సరిపోతుందా అని బాబుని అడిగే మాటలు…ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలను క్రియేట్ చేశాయి.


కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో.. శర్వానంద్ 35వ సినిమాగా మనమే రాబోతుంది. మరి ఈ సినిమా ఈ హీరోకి ఎలాంటి విజయం అందిస్తుందో వేచి చూడాలి.


 



 


Also read: Pancha Graha Kutami: ఈ మూడు రాశులకు అలర్ట్, జూన్ 5న పంచగ్రహ కూటమి ఉంది జాగ్రత్త



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook