Sharwanand Double meaning question to Balakrishna: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అనే షో ఎంత సూపర్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఈ షో మొదటి సీజన్ 10 ఎపిసోడ్లు పూర్తి చేసుకోగా రెండో సీజన్ కూడా ఇప్పటికే రెండు ఎపిసోడ్లు విజయవంతంగా పూర్తయ్యాయి. మొదటి ఎపిసోడ్ అన్ సెన్సార్ కట్ పేరుతో మూడో ఎపిసోడ్ గా రిలీజ్ చేశారు. ఇక తాజాగా నాలుగో ఎపిసోడ్ కూడా రిలీజ్ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఎపిసోడ్ లో అడవి శేషు కలిసి శర్వానంద్ పాల్గొన్నారు. ఈ ఇద్దరూ కలిసి నందమూరి బాలకృష్ణతో  సందడి చేయడమే కాకా పలు ఆసక్తికర సంగతులు కూడా పంచుకున్నారు. తాజా ఎపిసోడ్లో నందమూరి బాలకృష్ణ ఈ ఇద్దరినీ చాలా గట్టిగానే ర్యాగింగ్ చేశారు. అయితే శర్వానంద్ మాత్రం ఒక షాకింగ్ క్వశ్చన్ వేశాడు. అదేమిటంటే బాలకృష్ణ గారు నాకు చిన్నప్పుడు నుంచి అనేక అనుమానాలు ఉన్నాయి మీరు ఇప్పటిదాకా దాదాపు వంద ఒక పైగా సినిమాలో నటించారు కదా. దాదాపు పాతిక 30 మంది హీరోయిన్లతో చేసుంటారు కదా అని ప్రశ్నిస్తాడు.


చేసి ఉంటారు కదా అని అన్నాడు కానీ ఏం చేసి ఉంటారని అడిగాడు అనే మీమాంసలో బాలకృష్ణ పడడంతో అడవి శేషు వెంటనే అందుకుని ఏంటా మాటలు పద్ధతిగా మాట్లాడాలి కదా అంటూ కౌంటర్ వేసే ప్రయత్నం చేశారు. శర్వానంద్ నటించి ఉంటారు కదా అని అడుగుతున్నాను అని అంటూనే అంత మందితో నటించారు కదా మీ మీద ఎప్పుడూ పుకార్లు రాలేదా అని అడిగితే రాలేదని బాలకృష్ణ పేర్కొన్నారు.


అలా ఎలా సాధ్యం అంటే నందమూరి బాలకృష్ణ మీద పుకార్లు రాసే ధైర్యం ఎవరికైనా ఉంటుందా అని నందమూరి బాలకృష్ణ ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది ఇక ఈ షోలో భాగంగా నందమూరి బాలకృష్ణ అడవి శేష్, శర్వానంద్ చొక్కాలు విప్పించేందుకు ప్రయత్నించారు కానీ ఆ ఇద్దరు చాలా ప్రయత్నాలు చేసి కేవలం కోటు విప్పి మిగిలినవన్నీ సమాధానాలు కరెక్ట్ గా చెప్పి ఆ పోటీలో గెలుపొందారు. అలా వారిద్దరూ బాలకృష్ణ శిక్ష నుంచి తప్పించుకున్నారు. 


Also Read: Urvasivo Rakshasivo Review: అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో సినిమా ఎలా ఉందంటే?


Also Read: Anudeep KV Comments: గాడ్ ఫాదర్ బోరింగ్ సినిమా అంటూ అనుదీప్ షాకింగ్ కామెంట్స్.. ఛీఛీ అంటూ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook