Sharwanand Fiancy Deatils: అనేక రకాల ప్రచారాల అనంతరం యంగ్ హీరో శర్వానంద్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు. ఆయన పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. శర్వానంద్ రక్షిత రెడ్డి అనే యువతిని వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైకోర్టు లాయర్ మధుసూదన్ రెడ్డి కుమార్తె అయిన ఆమె మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి మనవరాలు వరుస అవుతారు అని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. ఐదు సార్లు చిత్తూరు నుంచి శ్రీకాళహస్తి నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆయన కొద్ది రోజుల క్రితం అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ప్రస్తుతానికి ఆయన కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి టిడిపి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమార్తె తరఫున రక్షిత రెడ్డి బంధువు అవతారని తెలుస్తోంది. రక్షిత రెడ్డి మామ గంగారెడ్డి గోపాలకృష్ణారెడ్డికి అల్లుడు అవుతారని చెబుతున్నారు.


ఇక వీరి వివాహానికి సంబంధించి రెండు కుటుంబాలు అధికారికంగా ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జనవరి 26వ తేదీన వీరిద్దరి ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ హోటల్ లో ఘనంగా జరగబోతోంది. కేవలం రెండు కుటుంబాలకు చెందిన వారికి మాత్రమే లోపలికి ఎంట్రీ ఉంటుందని చెబుతున్నారు. శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే శర్వానంద్ గత ఏడాది ఆడవాళ్లు మీకు జోహార్లు ఒకే ఒక జీవితం అనే సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.


ఇక ప్రస్తుతం ఆయన ఎలాంటి సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించలేదు. గత ఏడాది నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కి హాజరైన శర్వానంద్ పెళ్లి ఎప్పుడు అడిగిన పెళ్లి ఎప్పుడు అని అడిగిన ప్రశ్నకు ప్రభాస్ పెళ్లి తర్వాత అంటూ సమాధానం ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎట్టకేలకు శర్వానంద్ ఒక ఇంటి వాడవుతున్నాడు అన్న వార్త తెలియడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: Balakrishna No Entry: అన్నపూర్ణ స్టూడియోస్ లోకి బాలకృష్ణకు నో ఎంట్రీ.. అసలు ఏమైంది అంటే?


Also Read: Vijay No.1 Hero: 2022 టాప్ హీరోగా విజయ్.. పాన్ ఇండియా సినిమా లేకున్నా తగ్గేదేలే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook