Shilpa Shetty, mother Sunanda booked in cheating in wellness business: శిల్పా శెట్టిని ఇప్పుడప్పుడే కష్టాలు వీడేలా లేవు. పోర్నోగ్రఫి కేసులో అరెస్ట్ అయిన తన భర్త రాజ్ కుంద్రా ఇంకా ఆ కేసు నుంచి బయటపడక ముందే తాజాగా శిల్పా శెట్టి, ఆమె తల్లి సునందపై లక్నో పోలీసులు కేసు నమోదైంది. ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ వెల్‌నెస్ బిజినెస్‌లో జరిగిన మోసం కేసులో బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టితో పాటు ఆమె తల్లి సునంద పేర్లను లక్నో పోలీసులు ఎఫ్ఐఆర్‌లో చేర్చినట్టు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెల్‌నెస్ బిజినెస్‌కి సంబంధించిన ఫ్రాడ్ కేసులో శిల్పా శెట్టిని, ఆమె తల్లి సునందను (Shilpa Shetty's mother Sunanda Shetty) లక్నో పోలీసులు ప్రశ్నించనున్నారు. లక్నోకు చెందిన జ్యోత్స్న చౌహన్, రోహిత్ వీర్ సింగ్ విభుతిఖండ్ పోలీసు స్టేషన్, హజ్రత్ గంజ్ పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదయ్యాయి. 


Also read : Raj Kundra bail plea: రాజ్ కుంద్రాకు బెయిల్ ఇస్తే పారిపోయే ప్రమాదం: పోర్నోగ్రఫీ కేసులో ముంబై పోలీసులు


శిల్పా శెట్టి, సునందను ప్రశ్నించేందుకు లక్నో పోలీసులు ముంబై వెళ్లనున్నారని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ వెల్లడించింది. ఈమేరకు ఇప్పటికే శిల్పా శెట్టి, సునంద శెట్టికి రెండు పోలీసు స్టేషన్ల నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఐయోసిస్ వెల్‌నెస్ సెంటర్ (Iosis Wellness Centre) పేరిట శిల్పా శెట్టి చైర్మన్‌గా, సునంద డైరెక్టర్‌గా ఉన్న బిజినెస్‌లో ఫ్రాంచైజీలు ఇప్పించే పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి ముఖం చాటేశారని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులోనూ శిల్పా శెట్టికి (Shilpa Shetty) ఇబ్బందులు తప్పవా అనే టాక్ వినిపిస్తోంది.


Also read : 'ట్రిపోఫోబియా'తో బాధపడుతున్న స్టార్ హీరోయిన్...ఎవరో తెలుసా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook