Memes on Raj Kundra Bail: శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా మీమ్స్.. ఓ రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్లు
రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూర్ అయిన సందర్భంగా శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా దంపతులపై కొన్ని వేలల్లో మీమ్స్ తయారు చేస్తున్నారు. పోస్ట్ చేసిన కాసేపట్లోనే ఇవి తెగ వైరల్ అవుతున్నాయి.. వాటిలో కొన్ని చూద్దామా...??
Shilpa Shetty-Raj Kundra Funny Memes: వ్యాపారవేత్త మరియు బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల కేసులో అరెస్ట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. 62 రోజుల తర్వాత రాజ్ కుంద్రాకు బెయిల్ దొరికింది.
వ్యాపారవేత్తగా కొనసాగుతున్న భర్త రాజ్ కుంద్రాపై పోర్న్ సినిమాలు తీయడం, వాటిని అప్లికేషన్ ద్వారా విడుదల చేయడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. రూ. 50 వేల పూచీకత్తుపై రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు చేయబడింది. రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూర్ అయిన వార్త బయటకి రాగానే సోషల్ మీడియాలో మీమ్స్ ల వరద ప్రారంభమైంది.
Also Read: Me Too: పంజాబ్ కొత్త సీఎంకు మీటూ సెగ...చరణ్‌జీత్‌ను తొలగించాలని రేఖా శర్మ విజ్ఞప్తి..
వేలల్లో పోస్ట్‌లు చేస్తున్న నేటిజన్లు
శిల్పా శెట్టి - రాజ్ కుంద్రా గురించి ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో వివిధ రకాల ఫన్నీ పోస్ట్ లను పోస్ట్ చేస్తున్నారు. వీరిద్దరిని ఎగతాళి చేస్తూ నేటిజన్లు అనేక మీమ్‌లను పోస్ట్ చేస్తున్నారు. ఈ మీమ్స్‌లో, రాజ్ జైలు నుండి తిరిగి వచ్చిన తర్వాత శిల్పా శెట్టి ఎలా స్వాగతం పలుకుతుందో పోస్ట్ ద్వారా తెలిపారు. ఒక పోస్ట్ లో శిల్పా రోలు కర్రతో నిలబడి ఉంది.. రాజ్ ఇంటికి వెళ్లగానే శిల్పా ఎలా ఒక ఆట ఆడుకుతుందని దీని అర్థం..
మరో పోస్ట్ లో ఒక అమ్మాయి తన షర్టు విప్పుతున్న ఫోటో ఒకటి పోస్ట్ చేసి, పోర్నోగ్రఫీ కేసులో బెయిల్ పొందిన రాజ్ కుంద్రాకు ఇండస్ట్రీ ఇలా "ఓపెన్ హార్ట్ తో వెల్ కం" చెబుతుంది అని పోస్ట్ చేసాడు.
జూలై 19 న అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా
శిల్పా శెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోలీసులు జూలై 19 న అరెస్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకి చాలా రకాల చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటున్నాడు. రాజ్ కుంద్రా పోర్న్ సినిమాలు తీసి, వాటిని వెబ్ అప్లికేషన్లలో పోస్ట్ చేసాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా, షెర్లిన్ చోప్రా మరియు పూనమ్ పాండే చాలా మంది బాలీవుడ్ నటీమణులు రాజ్ కుంద్రాపై ఆరోపణలు చేసారు. ఈ కేసులో శిల్పా శెట్టిని కూడా విచారించగా... ఈ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని మరియు వీటి గురించి తనకు అస్సలు అవగాహన లేదని స్పష్టం చేసింది.
Also Read: UK New Travel Rules: యూకే జాతి వివక్ష, ఇండియా సహా కొన్ని దేశాలపై కొత్త ట్రావెల్ ఆంక్షలు
కుటుంబ బాధ్యతలు తీసుకున్న శిల్పా
శిల్పా శెట్టి - రాజ్ కుంద్రా గురించి మాట్లాడితే... ఆమె భర్త అరెస్ట్ అయినప్పటీ నుండి కుటుంబ బాధ్యతలను తీసుకొని, చాలా దైర్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్లిష్ట సమయం నుండి కుటుంబాన్ని రక్షించడానికి శిల్పా అన్ని విధాలుగా కృషి చేస్తుంది. ఎంత మంది చులకనగా పోస్ట్ చేసిన, ఎవరు ఎన్ని మాటలు అన్న ఆమె మాత్రం ఎప్పటిలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పనులను చేసుకుంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook