Shilpa shetty: అక్కడొక రియాల్టీ షో నడుస్తోంది. స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి..ప్రముఖ నిర్మాత రోహిత్ శెట్టితో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. అతనెంతకీ పలకకపోవడంతో మండిపడి..అతనిపై బాటిల్‌తో దాడి చేసి అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాస్ గాట్ ట్యాలెంట్ రియాల్టీ షో గురించి అందరికీ తెలిసిందే. ప్రముఖ ర్యాపర్ బాద్‌షా, నాటి నటుడు కిరన్ ఖేర్, పాటల రచయిన మనోజ్ ముంతషిర్‌లు ఈ షోకు న్యాయనిర్ణేతలుగా ఉన్నారు. రోహిత్ శెట్టి సినిమా సూర్యవంశి బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిచిన సందర్భంలో రోహిత్ శెట్టి ఈ షోలో పాల్గొన్నాడు.



ఈ వీడియోలో స్టార్ నటుడు ప్రముఖ నిర్మాత రోహిత్ శెట్టితో మాట్లాడేందుకు శిల్పాశెట్టి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో రోహిత్ శెట్టి..ర్యాపర్ బాద్‌షాతో మాట్లాడుతుంటాడు. శిల్పాశెట్టి మాటలు పట్టించుకోకుండా..బాద్‌షాతో మాటల్లో మునిగిపోతాడు. అంతే శిల్పాకు ఒళ్లు మండుతుంది. ఆతా మాఝీ సతకలీ అంటూ ఓ బాటిల్ తీసుకుని రోహిత్ చేతిపై భళ్లున పగలగొడుతుంది. ఇంకేముంది..రోహిత్ శెట్టితో పాటు అందరూ శిల్పా వంక చూస్తారు. దిగ్భ్రాంతికి గురవుతారు. నాకు సినిమా ఛాన్స్ ఇవ్వమని శిల్పా అడుగుతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా..నా సూట్ పాడైపోయిందంటూ రోహిత్ అరుస్తాడు.


శిల్పా అక్కడితో ఆగదు..అదే బాటిల్ మిగిలిన భాగాన్ని ర్యాపర్ బాద్‌షా చేతిపై కూడా పగలగొడుతుంది. శిల్పాశెట్టి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఎక్కౌంట్‌లో షేర్ చేస్తుంది. దానికో క్యాప్షన్ పెడుతుంది. గరమ్ ఝాలీ కేత్లి..ఆటా మాఝీ సతకలీ..మైనే బాట్లీ పంగా నహీ లేనేకా...ఫోడ్ ది మైనే బాట్లీ పంగా నహీ లేనే కా..క్యా...


శిల్పాశెట్టి అప్‌కమింగ్ సినిమా సుఖీ పోస్టర్ మార్చ్ 2వ తేదీన రిలీజైంది. మార్చ్ 3వ తేదీన సినిమా ఫస్ట్ షెడ్యూల్ కోసం చండీగడ్ నుంచి ముంబైకు పయనమైంది శిల్పాశెట్టి. హంగామా 2తో ఇటీవలే శిల్పాశెట్టి వెండితెరకు తిరిగొచ్చింది. 


Also read: Ajith New Look: స్టైలిష్‌ లుక్‌లో అజిత్‌.. ఆ సినిమా కోసమేనా?!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook