Shiva Rajkumar: `మీకు నేను ఉన్నా అన్న`’ Jr NTR..మీడియాతో పంచుకున్న శివరాజ్ కుమార్
Shiva Rajkumar: పునీత్ మరణం తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చారు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్. ఈ సందర్భంగా జూ. ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Shiva Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్(Puneeth Rajkumar) హఠాన్మరణం సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణం కన్నడిగులనే కాదు.. భారత సినీ పరిశ్రమను సైతం విషాదంలోకి నెట్టింది. ఆయన మరణించిన రోజు భారత సినీ ప్రముఖులు పునీత్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే.
పునీత్ మరణించి దాదాపు రెండు వారాలు అవుతోంది. ఈ నేపథ్యంలో తొలిసారి మీడియాకు ముందుకొచ్చారు పునీత్ అన్నయ్య, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్(Shiva Rajkumar). ఈ సందర్భంగా పునీత్ అకాల మరణంతో తమ కుటుంబంలో నెలకొన్న పరిస్థితుల గురించి వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇక పునీత్ మరణించిన రోజు ఆసక్తికర సంఘటన చోటుచేసుకుందని, ఆ రోజు అక్కడికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) తన దగ్గరికి వచ్చి ‘'మీకు నేను ఉన్నా అన్న'’ అంటూ ధైర్యం చెప్పారని శివరాజ్ అన్నారు.
Also read: Viral Video: RRR 'నాటు నాటు' పాటకు బామ్మ డ్యాన్స్.. ఎనర్జీకి ఫిదా అవుటున్న నెటిజన్లు
అనంతరం ఎన్టీఆర్ తో అనుబంధం గురించి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు శివరాజ్ కుమార్. కాగా ఎన్టీఆర్‌కు కన్నడ ఇండస్ట్రీతో మంచి సంబంధాలు ఉన్నాయి. పునీత్ రాజ్ కుమార్ కోసం ఎన్టీఆర్(NTR) ఆయన సినిమాలో ఒక పాట పాడారు. ఈ పాట తర్వాత పునీత్, ఎన్టీఆర్‌ల మధ్య సన్నిహిత్యం మరింత బలపడింది. అంతేగాక ఎన్టీర్ తనకు బ్రదర్ లాంటి వాడంటూ పునీత్ గతంలో పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook