Tamannaah Bhatia Dress Goes viral: సెలబ్రెటీలు ఎప్పుడూ ట్రెండీగా కనిపించడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా సినిమా తారలు, క్రికెటర్లు అయితే స్టైలిష్‌గా ఉండటానికి ఎంతైనా ఖర్చు పెడతారు. అందుకే వీళ్ల గురించి ఎప్పుడూ నెట్టింట చర్చ జరుగుతూ ఉంటుంది.  తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) ధరించిన డ్రెస్సు ధర.. నెటిజన్లను షాక్ కుు గురిచేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల తాను నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘'జీ కర్దా'’ ప్రారంభానికి స్కై బ్లూ కలర్‌ డ్రెస్సులో వచ్చింది తమన్నా. అయితే అప్పటి నుంచి ఈమె ధరించిన డ్రెస్ గురించి ఆరా తీయడం మెుదలపెట్టారు నెటిజన్లు. ఈ డ్రెస్‌ రేటు (Tamannaah Bhatia dress Price) రూ. 2,69,121 అని ప్రముఖ ఆంగ్ల మీడియాలో కథనం వెలువడటంతో అవాక్కయ్యారు. ఆ డ్రెస్సుకు మ్యాచింగ్‌గా వేసుకున్న తమన్నా చెప్పులూ కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి. వాటి ఖరీదును ఆరా తీయగా రూ. 90, 800గా తేలింది. 


'జీ కర్దా'’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో తమన్నా నటించిన ‘'ఎఫ్‌ 3’' మూవీ మే 27న ప్రేక్షకుల ముందుకురానుంది. అలాగే  ఈ అమ్మడు సత్యదేవ్ తో కలసి చేసిన 'గుర్తుందా శీతాకాలం' కూడా త్వరలోనే రిలీజ్ కానుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'భోళా శంకర్' లో నటిస్తోంది. 


Also Read: Samantha Love: ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత.. మరోసారి లవ్‌‌లో..! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook