`సాహో` లో శ్రద్ధా పాత్ర కీలకం: ప్రభాస్
బాహుబలి విజయం తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. ఈ సినిమాకు దర్శకుడు సుజీత్.
బాహుబలి విజయం తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. ఈ సినిమాకు దర్శకుడు సుజీత్. యువీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.. ! తాజాగా ఈ చిత్రం గురించి ప్రభాస్ మాట్లాడారు.
ప్రభాస్ మాట్లాడుతూ- ఈ సినిమాలో శ్రద్దా కపూర్ పాత్ర చాలా కీలకం. ఆమెను పాటలు, డ్యాన్స్ కోసం తీసుకోలేదు. సాహోలో ఆమెను తీసుకోవడం బెస్ట్ చాయిస్. శ్రద్దా చేసే యాక్షన్ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి. మూవీ కోసం ఆమె చాలా కష్టపడ్డారు. ఆమె నటనకు నేను ఇంప్రెస్ అయ్యాను. గతంలో నాతో నటించిన హీరోయిన్లు టాలీవుడ్ లో మెప్పించి బాలీవుడ్ కు వెళ్లారు. కానీ శ్రద్దా అలా కాదు. బాలీవుడ్ లో తనేంటో నిరూపించుకొని టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు"అన్నారు. శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో డబుల్ రోల్ లో నటిస్తున్నారని టాక్.