Shraddha Kapoor: స్త్రీ అంటే ఇష్టం అంటున్న శ్రధ్ధ.. పెళ్లి గురించి దిమ్మ తిరిగే జవాబు!
Stree 2: స్త్రీ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో.. శ్రద్ధ కపూర్ కు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. బాలీవుడ్ మీడియా.. ఇప్పటికే ఆమె రాహుల్ మోడీతో రిలేషన్ షిప్ లో ఉంది అని చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. పెళ్లి గురించి ఆమె ఇచ్చిన జవాబు అందరికీ షాక్ ఇచ్చింది.
Shraddha Kapoor Wedding: రాజ్ కుమార్ రావు, శ్రద్ధ కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన స్త్రీ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అయింది. హారర్ కామెడీగా వచ్చిన.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి.. సీక్వెల్ గా స్త్రీ 2..త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు హీరోగా నటించగా, స్త్రీ పాత్రలో శ్రద్ధ కపూర్ కనిపించనున్నారు. భారీ అంచనాల.. మధ్య ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా ముంబయిలో దర్శక నిర్మాతలు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన శ్రద్ధా కపూర్ కి పెళ్లికి సంబంధించిన.. ప్రశ్న ఎదురైంది.
ఓ విలేకరి శ్రద్ధను పెళ్లి గురించి ప్రశ్నించగా.. ఆమె
తనదైన శైలిలో సమాధానమిచ్చారు. సినిమాలో తన స్త్రీ క్యారెక్టర్ ను ఉద్దేశిస్తూ.. స్త్రీ తనకు ఇష్టమున్నప్పుడు పెళ్లి చేసుకుంటుంది అని సైలెంట్ గా కౌంటర్ ఇచ్చారు.
అయితే స్త్రీకి.. స్క్రీన్ రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన రాహుల్ మోడీతో ఆమె రిలేషన్షిప్ లో ఉంది అని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ మధ్యనే అతడితో కలిసి ఆమె దిగిన సెల్ఫీని శ్రద్ధ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి.
తూ ఝూఠీ మై మక్కార్ (Tu Jhoothi Main Makkaar) సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది అని, త్వరలో వీళ్ళిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అని నెట్టింట చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే సదరు జర్నలిస్టు ఆమెను.. ఈ ప్రశ్న వేశారు. కానీ శ్రద్ధ మాత్రం తెలివిగా జవాబు ఇచ్చింది అని ఫ్యాన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు.
రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. తమన్నా ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఈ పాట మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ చూస్తే పార్ట్ 2 లోనే ఎక్కువ కామెడీ ఉండేలాగా కనిపిస్తుంది.
Also Read: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
Also Read: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook