Shraddha Walker Murder Case: దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన శ్రద్ధా హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అఫ్తాబ్ గ్రైండర్‌లో శ్రద్ధా ఎముకలను గ్రైండ్ చేసి, ఆపై ఎముకల పొడిని పార చేసినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాపై ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను సాకేత్ కోర్టు మంగళవారం విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. అదే విధంగా అఫ్తాబ్‌ తరపు న్యాయవాదికి కూడా కోర్టు ఛార్జ్‌షీట్‌ కాపీని అందించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అఫ్తాబ్ తన లైవ్-ఇన్ పార్ట్నర్ శ్రద్ధా వాకర్‌ గొంతు కోసి, ఆమె శరీరాన్ని ఛిద్రం చేశాడని పోలీసులు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు.  చార్జిషీట్‌ను పరిశీలించేందుకు ఫిబ్రవరి 21వ తేదీని కోర్టు తదుపరి తేదీగా నిర్ణయించగా జనవరి 24న పోలీసులు 6,629 పేజీల చార్జిషీటును దాఖలు చేశారు. మృతదేహాన్ని ముక్కలు చేసిన తర్వాత ఆ రంపాన్ని అడవిలో విసిరినట్లు అఫ్తాబ్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన అనేక మంది అమ్మాయిలతో కూడా డేటింగ్ చేస్తున్నాడని పోలీసులు ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు.


శ్రద్ధను చంపి ముక్కలు ముక్కలుగా నరికి కొన్ని ముక్కలను ఫ్రిజ్ లో ఉంచిన తరువాత కూడా ఓ అమ్మాయిని కూడా ఇంటికి తీసుకొచ్చాడు. శ్రద్ధా హత్య జరిగిన వెంటనే, అఫ్తాబ్ మళ్లీ డేటింగ్ యాప్ బంబుల్ ద్వారా పలువురు మహిళలతో పరిచయం పెంచుకున్నాడని ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసినప్పుడు, శ్రద్ధ అతనిని వివాహం చేసుకోవాలనుకుంటోందని అందుకే ఆమెను చంపానని చెప్పాడు. హత్య జరిగిన మూడు, నాలుగు నెలల తర్వాత నిందితులు శ్రద్ధా ముఖాన్ని ఛిద్రం చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు.


అఫ్తాబ్ ఆమెను చంపిన మూడు నాలుగు నెలల తర్వాత బ్లో టార్చ్‌తో కాల్చి శ్రద్ధా ముఖం మరియు జుట్టును పాడుచేయడానికి ప్రయత్నించాడని, తద్వారా ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమె గుర్తింపు బయటకు తెలియ రాదని అనుకున్నాడు. అఫ్తాబ్ శ్రద్ధాను సుత్తితో కొట్టి చంపి, 3 కత్తులతో 35 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ పెట్టాడని, . బ్లోటార్చ్ తో ఆమె వేళ్లను కత్తిరించి ఎముకలను స్టోన్ గ్రైండర్తో పొడి చేసి ఆ పౌండర్ అడవిలో చల్లాడని తెలిపారు. శ్రద్ధాను చంపిన తర్వాత అఫ్తాబ్ జొమాటోలో చికెన్ రోల్స్ సైతం ఆర్డర్ చేసుకున్నాడని పోలీసులు తేల్చారు.


ఆ తర్వాత అఫ్తాబ్ శ్రద్ధ తల, మొండెం మరియు ఇతర శరీర భాగాలను ఛతర్‌పూర్ అడవుల్లో విసిరినట్లు చార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. ఇక ఈ ఈ కేసులో హత్యకు గల కారణాలు కూడా ఇప్పుడు స్పష్టమయ్యాయి. దాని ప్రకారం శ్రద్ధాకు ఒక కొత్త స్నేహితుడు పరిచయం అవడంతో ఆమె మే 17, 2022న అతన్ని కలవడానికి గురుగ్రామ్‌ వెళ్లింది. ఆమె ఆ రోజు ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లి రాత్రి కూడా తిరిగి రాలేదు, ఈ క్రమంలో కోపంతో అఫ్తాబ్ ఆమెను చంపాడని పోలీసులు పేర్కొన్నారు. 
Also Read: Das Ka Dhamki postponed: ఇచ్చిపడేద్దాం అంటూనే రిలీజ్ వాయిదా వేసిన విశ్వక్.. అసలు సంగతి అదా?


Also Read: Kiara Advani Wedding: ఎట్టకేలకు ప్రియుడిని వివాహమాడిన కియారా అద్వానీ.. కానీ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.