Software Blues movie Official Trailer Out: ఉమాశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సాఫ్ట్‌వేర్ బ్లూస్'. సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకి సుభాష్ ఆనంద్ మ్యూజిక్ అందించారు. శ్రీరాం, భావనా, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కేఎస్ రాజు, బస్వరాజ్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సాఫ్ట్‌వేర్ బ్లూస్ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్‌ను వదిలింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాఫ్ట్‌వేర్ బ్లూస్ సినిమా ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ క్రిష్ లాంచ్ చేశారు. ఒక నిమిషం 56 సెకండ్ల నిడివి గల ఈ వీడియో.. 'సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే పెద్దపెద్ద బిల్డింగ్‌లు, లక్షల్లో శాలరీలు, అమ్మాయిలు పబ్బులు కాదు.. దూల తీరిపోద్ధిరా.. రేయ్' అనే డైలాగ్‌తో ఆరంభం అవుతుంది. '7+2=9 రా.. 9 నా లక్కీ నెంబర్.. ఈ రోజు జాబ్ పక్కా', 'చేయి చూపించుమన్నాడు.. చూపించా! చూసి దొబ్బెయ్ అన్నాడు', 'ఓ చేతిలో బుక్.. ఇంకో చేతిలో బీరు పట్టుకుని చదివితే ఎలా వస్తాదిరా జాబ్' అనే డైలాగ్స్ బాగున్నాయి. 


ట్రైలర్ లాంచ్ చేసిన అనంతరం డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ... 'ట్రైలర్‌ చాలా బాగుంది. సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే పెద్దపెద్ద బిల్డింగ్‌లు, లక్షల్లో జీతాలు, అమ్మాయిలు పబ్బులు కాదు.. దూల తీరపోద్ధిరా రేయ్ అనే డైలాగ్ చాలా బాగుంది. సాఫ్ట్‌వేర్‌లో జరిగే చిన్న చిన్న గమ్మత్తులు, వారి జీవితాల గురించి దర్శకుడు చాలా చక్కగా తెరకెక్కించారు. దర్శకుడు ఉమాశంకర్‌కు ఆల్ ద బెస్ట్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు.



డైరెక్టర్ ఉమాశంకర్ మాట్లాడుతూ... 'ఈ చిత్ర ట్రైలర్‌ను చూసి మంత్రి కేటీఆర్ మెచ్చుకున్నారు. చాలా సంతోషమేసింది. సాఫ్ట్‌వేర్ బ్యాక్ డ్రాప్‌లో మూవీని తెరకెక్కించాము. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరుతున్నా' అని పేర్కొన్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మూవీని తెరకెక్కించినట్లు సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ వీకే రాజు చెప్పారు. వెండితెరపై మూవీని చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. 


Also Read: Indian Railways Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 1.48 లక్షల రైల్వే ఉద్యోగాల భర్తీకి ప్రకటన!  


Also Read: వాహనదారులకు అలర్ట్.. ఇకపై ఆ నంబర్ ప్లేట్లు తప్పనిసరి! పాత వాహనాలకు కూడా



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook