శ్రియ శరన్‌కి ఆల్రెడీ పెళ్లయిపోయిందా ? ఆమె రష్యాకు చెందిన తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రి కోస్‌చీవ్‌ని మార్చి 12వ తేదీనే ముంబైలో పెళ్లి చేసుకుందా అంటే అవుననే అంటున్నాయి ముంబై మీడియా వర్గాలు. వాస్తవానికి ఉదయ్‌పూర్‌లో ఆమె పెళ్లి జరగనుందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన శ్రియ మాత్రం అందులో నిజం లేదు అని కొట్టిపారేసింది. కాకపోతే ఆమె పెళ్లి మాత్రం మార్చి 12వ తేదీనే జరిగింది అని తాజాగా మీడియా కథనాలు స్పష్టంచేస్తున్నాయి. ముంబైలోని అంధేరిలో వున్న తన నివాసంలో రహస్యంగానే ఈ వివాహం జరిగిందని, ఇరు కుటుంబాల పెద్దలు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారని మీడియా కథనాలు చెబుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముంబైలో శ్రియకు పక్కింటిలో నివాసం వుంటున్న మనోజ్ బాయ్‌పాయి, అతడి భార్య శబానా మాత్రమే ఈ పెళ్లికి హాజరైన అతిధుల జాబితాలో వున్నారు అనేది ఆ కథనాల సారాంశం. పూర్తి హిందు సంప్రదాయం ప్రకారం శ్రియ పెళ్లి జరిగినట్టు సమాచారం. ఇక శ్రియ వైపు నుంచి అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి వుందని మీడియా చెబుతున్నప్పటికీ.. ఆమె నుంచి మాత్రం ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. 


శ్రియ బాయ్ ఫ్రెండ్ ఆండ్రి కోస్‌చీవ్ విషయానికొస్తే, రష్యా టెన్నిస్ ప్లేయర్ అయిన ఆండ్రి అక్కడ ప్రస్తుతం క్రీడా రంగంలో పెట్టుబడులు పెడుతూ హోటల్ వ్యాపారంలో వ్యాపారవేత్తగా రాణిస్తున్నాడు.