Shruti Hassan Movies List: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో.. కమలహాసన్ కుమార్తెగా.. భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న శృతిహాసన్.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఎన్నో అవమానాలే.. కాదు ఐరన్ లెగ్ ముద్ర కూడా వేయించుకుంది.  కానీ ఇప్పుడు ఏకంగా గోల్డెన్ లెగ్ అయిపోయింది ఈ హీరోయిన్స. ఈ రోజుతో శృతిహాసన్ ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు అవుతోంది.  మరి ఈ 15 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఆమె జర్నీ ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం…


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కమలహాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోక వచ్చిన ఈమె హే రామ్.. అనే సినిమాలో బాలనటిగా ఒక పాత్ర చేసింది.  ఆ తర్వాత లక్ అనే సినిమాతో హీరోయిన్ గా తన కెరియర్ మొదలు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. కమలహాసన్ కూతురిగా గుర్తింపు ఉన్నప్పటికీ.. ఇమ్రాన్ ఖాన్,  సంజయ్ దత్ వంటి భారీ తారాగణంతో నటించిన్నప్పటికీ.. ఈమెకు లక్ సినీమా ద్వారా గుర్తింపు మాత్రం రాలేదు. ఆ తర్వాత కూడా వరుస అవకాశాలు అందుకున్నా.. విజయాలు మాత్రం రాలేదు. దీంతో ఐరన్ లెగ్ అనే  ముద్ర వేయించుకుంది. 


ఇక లక్ తర్వాత.. అనగనగా ఒక ధీరుడు సినిమా చేసింది ఈ ముద్దుగుమ్మ. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించిన.. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత కోలీవుడ్లో.. వై దిస్ కొలవరి పాట భారీ విజయాన్ని అందుకుంది .కానీ ఈ పాట ఉన్న.. ధనుష్, శృతి హాసన్ సినిమా..3..  మాత్రం హిట్ కాలేదు. 


ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది. ఏ ఒక్కటి కూడా ఈమెకు భారీ విజయాలనైతే ఇవ్వలేదు. నటిగా,  హీరోయిన్ గా,  అందాల భామగా పేరు తెచ్చుకున్న ఈమె సక్సెస్ అందుకోవడంలో మైనస్ గానే నిలిచింది. అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఈమె కెరీర్ను మలుపు తిప్పింది. 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్ గా గబ్బర్ సింగ్ సినిమా ఈమె కెరియర్ ను  ఒక్కసారిగా మార్చేసింది . సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడమే కాదు.. అప్పటివరకు ఐరన్ లెగ్ అని పిలిపించుకున్న ఈమె.. ఈ సినిమాతో గోల్డెన్ లెగ్ గా మారిపోతుంది.  నిర్మాత బండ్ల గణేష్ సైతం శృతిహాసన్ పై.. ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సహకారంతోనే తనకు హీరోయిన్ గా అవకాశం వచ్చిందని అప్పుడప్పుడు చెబుతూ ఉంటుంది.


ఇక తర్వాత వరుసగా బలుపు, రేసుగుర్రం, ఎవడు,  శ్రీమంతుడు,  ప్రేమమ్ ఇలా అన్ని చిత్రాలు కూడా ఈమెకు భారీ విజయాన్ని అందించాయి. దీంతో వెనకు తిరిగి చూసుకోలేదు. అయితే ఒకానొక సమయంలో వ్యక్తిగతపరంగా ప్రేమ,  బ్రేకప్ అంటూ కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమైన ఈమె..మళ్లీ 2023లో క్రాక్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.   


సీనియర్ హీరోలైన చిరంజీవి, రవితేజ, బాలకృష్ణ వంటి హీరోలను మొదలుకొని యంగ్ హీరోలైన ప్రభాస్, రామ్ చరన్ వరకు..దాదాపూ అందరి సినిమాలలో.. నటించి మంచి పేరు  సొంతం చేసుకుంది. గత ఏడాది ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం సలార్ లో నటించి ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం సలార్ 2,  డెకాయిట్ , కూలీ , టాక్సిక్ వంటి చిత్రాలలో కీలకపాత్రలు పోషిస్తుంది ఈ‌ హీరోయిన్.


Also Read: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..


Also Read: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook